Telugu Global
Sports

సూర్య సూపర్,అర్షదీప్ అదుర్స్!

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలను విజయంతో ప్రారంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి సన్నాహాక మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్ అదరగొట్టడంతో భారత్ 13 పరుగుల విజయం సాధించింది.

సూర్య సూపర్,అర్షదీప్ అదుర్స్!
X

ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ భారత్ టీ-20 ప్రపంచకప్ సన్నాహాలను విజయంతో ప్రారంభించింది.పెర్త్ వేదికగా జరిగిన తొలి సన్నాహాక మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్ అదరగొట్టడంతో భారత్ 13 పరుగుల విజయం సాధించింది....

కంగారూగడ్డపై ఈనెల 16 నుంచి ప్రారంభంకానున్నటీ-20 ప్రపంచకప్ కు టాప్ ర్యాంకర్ భారత్ జోరుగా మొదలు పెట్టింది. ప్రపంచకప్ కు వేదికగా నిలిచిన ఆస్ట్ర్రేలియాలోని ఫాస్ట్, బౌన్సీ పిచ్ లతో పాటు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి వీలుగా...రోహిత్ శర్మ నాయకత్వంలోని 14మంది సభ్యుల భారతజట్టు పదిరోజుల ముందుగానే పెర్త్ నగరానికి చేరుకొంది.

వెస్టర్న్ ఆస్ట్ర్రేలియాజట్టుతో పెర్త్ వేదికగా జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో భారత్ 13 పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 6 వికెట్లకు 158 పరుగుల స్కోరు సాధించింది. సమాధానంగా వెస్టర్న్ ఆస్ట్రేలియాజట్టు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సూర్యకుమార్ మెరుపు హాఫ్ సెంచరీ...

రోహిత్ శర్మకు బదులుగా రిషభ్ పంత్- రాహుల్ ల జోడీతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తరపున మిస్టర్ 360 స్ట్ర్రోక్ మేకర్ సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపించాడు.

సూర్య తనదైనశైలిలో షాట్లు కొడుతూ కేవలం 35 బాల్స్ లోనే 52 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పెర్త్ బౌన్సీ పిచ్ పైన సైతం సూర్య చెలరేగిపోయాడు. 3 బౌండ్రీలు, 3 సిక్సర్లతో అర్థశతకం పూర్తి చేసి ఆట 17వ ఓవర్లో అవుటయ్యాడు.

ఆల్ రౌండర్లు దీపక్ హుడా 14 బాల్స్ లో 22 పరుగులు, హార్థిక్ పాండ్యా 20 బాల్స్ లో 29 పరుగులు సాధించడంతో భారత్ 158 పరుగుల స్కోరును చేరుకోగలిగింది.

అర్షదీప్ స్వింగ్ మ్యాజిక్...

159 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన వెస్టర్న్ ఆస్ట్ర్రేలియాజట్టు పవర్ ప్లే ఓవర్లలోనే నాలుగు టాపార్డర్ వికెట్లు నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది. ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ బంతిని ఇరువైపులా స్వింగ్ చేస్తూ కీలక వికెట్లు పడగగొట్టాడు. అర్షదీప్ 3 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, చహాల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

స్టార్ ప్లేయర్ విరాట్ కొహ్లీ లేకుండానే భారత్ ఈ సన్నాహాక మ్యాచ్ లో పాల్గొనడం విశేషం. ప్రపంచకప్ లో భాగంగా భారత్ ఈనెల 23న తన ప్రారంభమ్యాచ్ ఆడటానికి ముందు మరో రెండు సన్నాహక మ్యాచ్ ల్లో పాల్గోనుంది.

First Published:  11 Oct 2022 3:35 PM IST
Next Story