Telugu Global
Sports

త‌న బ్యాటింగ్ ప్ర‌తిభ‌తో అబ్బుర‌ప‌రుస్తున్న‌ సూర్యకుమార్

ముఖ్యంగా ఆఖ‌రి ఓవ‌ర్లో ఆఖ‌రి వైడ్ బాల్‌ను సూర్య‌కుమార్ యాద‌వ్ సిక్స్‌గా మ‌లిచిన తీరు క్రికెట్ అభిమానుల‌నేకాదు, సాటి అత్యుత్త‌మ క్రికెట‌ర్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

త‌న బ్యాటింగ్ ప్ర‌తిభ‌తో అబ్బుర‌ప‌రుస్తున్న‌ సూర్యకుమార్
X

టీ-20 ప్ర‌పంచ్ క‌ప్‌లో టీమిండియా ప్లేయ‌ర్‌ సూర్యకుమార్ యాదవ్ తన స్ట్రోక్‌ప్లేతో అబ్బురపరుస్తున్నాడు. మోస్ట్ ప్రామిసింగ్ బ్యాట్స్‌మెన్‌గానేగాక‌, 2022 క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్ట్ర‌యిక్ రేట్ ఉన్న బ్యాట్స్‌మెన్‌ల‌లో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. ప్ర‌తి మ్యాచ్‌లోనూ టాప్ ఆర్డ‌ర్ ఎలా ఆడినా, సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం జ‌ట్టుకు వెన్నెముక‌గా నిలుస్తున్నాడు. బ్యాటింగ్‌లోనేకాదు, ఫీల్డింగ్‌లోనూ సూర్య‌కుమార్ జీనియ‌స్ అనిపించుకుంటున్నాడు. ఒక‌ర‌కంగా ఎంఎస్ ధోనీ లేని లోటును భార‌త జ‌ట్టుకు రిప్లేస్ చేస్తున్నార‌ని క్రికెట్‌ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆదివారం నాటి జింబాబ్వే మ్యాచ్‌లో సూర్య‌కుమార్ బ్యాటింగ్ ప్ర‌తిభ ప్ర‌పంచానికి మ‌రోసారి తెలిసింది.


360 డిగ్రీల బ్యాటింగ్ యాద‌వ్ సొంతం!

ఎంత‌టి బ్యాటింగ్ నిపుణుడికైనా కొన్ని యాంగిల్స్‌లో మాత్ర‌మే బ్యాటింగ్ తిప్పే నైపుణ్యం ఉంటుంది. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్ మాత్రం 360 డిగ్రీల బ్యాటింగ్ కొత్తగా అనిపించింది. ఆ బ్యాటింగ్ నైపుణ్య‌మే జింబాబ్వేను ఎదురుగా వస్తున్న రైలులాగా ఢీకొట్టింది. చివరి 30 బంతుల్లో భారత్ 79 పరుగులు చేసింది. అందులో ఒక్క‌ సూర్యకుమార్ మాత్ర‌మే 55 పరుగులు చేశాడు. 26 బంతుల్లో 61 ప‌రుగులు (నాటౌట్‌) తీసి జింబాబ్వే ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లను, ఆఫ్-స్టంప్ వెలుపల ఫుల్ లెంగ్త్ బౌలింగ్ వ్యూహాల‌ను చిత్తు చేశాడు. ఫైన్ లెగ్‌పై ఉన్నవారిని పదేపదే ఎంచుకొని-ర్యాంప్ చేశాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో జింబాబ్వే గుండెల్లో ద‌డ పుట్టించాడు. ముఖ్యంగా ఆఖ‌రి ఓవ‌ర్లో ఆఖ‌రి వైడ్ బాల్‌ను సూర్య‌కుమార్ యాద‌వ్ సిక్స్‌గా మ‌లిచిన తీరు క్రికెట్ అభిమానుల‌నేకాదు, సాటి అత్యుత్త‌మ క్రికెట‌ర్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.


ఈ ఏడాది అత్యుత్త‌మ T20I బ్యాటర్

ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ T20 ఇంట‌ర్నేష‌న‌ల్‌ బ్యాటర్ అంటూ కామెంటేట‌ర్ల ప్ర‌శంస‌లు అందుకున్నాడు సూర్య‌కుమార్‌యాద‌వ్‌. ఆదివారం మ్యాచ్‌లో జింబాబ్వేతో 61 పరుగుల చేయ‌డంతో T20Iలలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యికిపైగా పరుగులు చేసిన రెండవ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2021లో మహ్మద్ రిజ్వాన్ ఈ ఫీట్ సాధించిన తర్వాత, సూర్య కుమార్ కూడా అగ్రస్థానానికి చేరుకున్నాడు. T20 ప్రపంచ కప్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌ 193.96తో టాప్ ఆర్డ‌ర్‌లో ఉన్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను గత సంవత్సరం అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపికైన‌ప్ప‌టి నుండి ఇదే రకమైన ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ బ్యాటింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంది, అంతర్జాతీయ కెరీర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ ముందు ముందు మ‌రెన్నో రికార్డులు తిర‌గరాస్తాడ‌న‌డంలో సందేహం లేదు.

First Published:  7 Nov 2022 7:02 AM GMT
Next Story