Telugu Global
Sports

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో శ్రీలంక, నెదర్లాండ్స్

2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు మాజీ చాంపియన్ శ్రీలంక, చిన్నజట్లలో పెద్దజట్టు నెదర్లాండ్స్ అర్హత సాధించాయి

ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో శ్రీలంక, నెదర్లాండ్స్
X

2022 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ కు మాజీ చాంపియన్ శ్రీలంక, చిన్నజట్లలో పెద్దజట్టు నెదర్లాండ్స్ అర్హత సాధించాయి. హేమాహేమీజట్లతో కూడిన గ్రూప్ -1లో శ్రీలంక, గ్రూప్-2లో నెదర్లాండ్స్ తమ అదృష్టం పరీక్షించుకోనున్నాయి...

టీ-20 ప్రపంచకప్ తొలిదశ ..సూపర్ -12కు అర్హత రౌండ్ పోటీలలో మాజీ చాంపియన్, ఆసియాకప్ విజేత శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు తమ గ్రూపు నుంచి సఫలమయ్యాయి.

గత వారం రోజులుగా జరుగుతున్న క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో నమీబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , నెదర్లాండ్స్ జట్లతో కూడిన గ్రూపులీగ్ లో శ్రీలంక 2 విజయాలు, ఓ పరాజయం రికార్డుతో ...లీగ్ టాపర్ గా మెయిన్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

నెదర్లాండ్స్ మూడుమ్యాచ్ లు ఆడి ఒకే ఒక్క గెలుపుతో మెరుగైన రన్ రేట్ ప్రాతిపదికన సూపర్-12 రౌండ్ కు చేరుకోగలిగింది. నమీబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం ఒక్కో విజయం సాధించి..నెదర్లాండ్స్ తో పాయింట్ల లో సమఉజ్జీగా నిలిచినా..మెరుగైన రన్ రేట్ లో వెనుకబడిన కారణంగా టోర్నీ నుంచి నిష్క్ర్రమించక తప్పలేదు.

కుశల్ మెండిస్ బ్యాటింగ్ షో...

జిలాంగ్ వేదికగా జరిగిన క్వాలిఫైయింగ్ ఆఖరిరౌండ్ పోరులో శ్రీలంక 16 పరుగులతో నెదర్లాండ్స్ ను అధిగమించింది. ఈ కీలక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు సాధించింది. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులతో మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

చరిత అసలంక 31 పరుగులతో తనవంతుగా కీలక స్కోరు అందించాడు. డచ్ బౌలర్లలో మీకెరెన్‌, బాస్‌ లీడ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

163 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఓపెనర్‌ మ్యాక్స్‌ డౌడ్‌ (71 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తుదివరకూ పోరాడినా తనజట్టును విజేతగా నిలుపలేకపోయాడు.

శ్రీలంక లంక బౌలర్లలో స్పిన్ జాదూ హసరంగ 3, తీక్షణ 2 వికెట్లు పడగొట్టారు. కుశాల్‌ మెండిస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

అయితే ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ .. ఓడినా.. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన కారణంగా సూపర్‌-12కు చేరుకో గలిగింది.

గ్రూప్ ఆఫ్ డెత్ లో శ్రీలంక...

తొలిదశ అర్హత రౌండ్ నుంచి సూపర్-12 చేరిన శ్రీలంక...గ్రూప్ -1లో హేమాహేమీజట్లతో తలపడాల్సి ఉంది. గ్రూప్ ఆఫ్ డెత్ గా పేరుపొందిన గ్రూప్-1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్ర్రేలియా, అఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

నెదర్లాండ్స్ మాత్రం సూపర్ -12 రౌండ్ గ్రూప్-2 లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో పాటు...వెస్టిండీస్ లేదా జింబాబ్వే జట్లలో ఏదో ఒకజట్టుతో తలపడాల్సి ఉంది.

First Published:  21 Oct 2022 9:45 AM IST
Next Story