Telugu Global
Sports

తెలుగు క్రీడాకారులకు క్రీడాపురస్కారాలు

జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి తెలుగుతేజం, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆచంట శరత్ కమల్ ఎంపికయ్యాడు.

తెలుగు క్రీడాకారులకు క్రీడాపురస్కారాలు
X

తెలుగు క్రీడాకారులకు క్రీడాపురస్కారాలు

జాతీయ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారానికి తెలుగుతేజం, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ ఆచంట శరత్ కమల్ ఎంపికయ్యాడు.

బాక్సింగ్ విన్నర్ నిఖత్ జరీన్, టీటీ మెడలిస్ట్ ఆకుల శ్రీజ అర్జున పురస్కారాలకు ఎంపికయ్యారు..

జాతీయ క్రీడాపురస్కారాలను కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిన వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది క్రీడాకారులకు

ఖేల్ రత్న, అర్జున, జీవన సాఫల్య పురస్కారాలను ఈనెల 30న రాష్ట్ర్రపతి భవన్ లో జరిగే ఓ కార్యక్రమంలో అందచేయనున్నారు.

శరత్ కమల్ కు అరుదైన గౌరవం..

తూర్పుగోదావరి జిల్లాలో జన్మించి ఉద్యోగరీత్యా తమిళనాడులో ఉంటున్న టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ కష్టానికి 40 సంవత్సరాల వయసులో తగిన గుర్తింపు లభించింది.

ఇటీవలే బర్మింగ్ హామ్ లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ మూడు విభాగాలలో బంగారు పతకాలు సాధించిన శరత్ కమల్ ను దేశ అత్యున్నత క్రీడాపురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వరించింది.

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో న‌వంబ‌ర్ 30వ తేదీన జ‌రిగే వేడుక‌లో రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా శ‌ర‌త్ క‌మ‌ల్‌ ఈ అవార్డు అందుకోనున్నాడు.శ‌ర‌త్ క‌మ‌ల్ 2019లో ప‌ద్మ‌శ్రీ, 2004లో అర్జున అవార్డులు అందుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ 13 కామ‌న్‌వెల్త్ మెడ‌ల్స్ సంపాదించాడు. ఏషియ‌న్ గేమ్స్‌లో రెండు ప‌త‌కాలు గెలిచాడు. అంతేకాదు నాలుగు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. మ‌న‌దేశంలో ప‌దిసార్లు సీనియ‌ర్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన మొద‌టి టేబుల్ టెన్నిస్‌ ఆట‌గాడిగా శ‌ర‌త్ క‌మ‌ల్ చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌స్తుతం ఈ స్టార్ ప్లేయ‌ర్ యూరోపియ‌న్ లీగ్స్‌లో ఆడుతున్నాడు.

గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నగా ఇచ్చే దేశఅత్యున్నత క్రీడాపురస్కారాన్ని 2002 సంవత్సరం నుంచి భార‌త హాకీ పితామహుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌర‌వార్థం ఇస్తున్నారు.


నిఖత్, శ్రీజలకు అర్జున....

మహిళల బాక్సింగ్ లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజలకు అర్జున అవార్డులను ప్రకటించారు.

బ్యాడ్మింట‌న్ యువ ఆట‌గాడు ల‌క్ష్య‌సేన్‌, డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా సైతం అర్జున అవార్డుకు ఎంపిక‌ైనవారిలో ఉన్నారు. కేరళ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రణయ్, ఎల్దోసీ పాల్ అర్జున పురస్కారాలకు, అవినాశ్ సాబ్లే, జీవన్ జోత్ సింగ్ తేజా, సుమన్ శిరూర్, సుజీత్ మాన్ ద్రోణాచార్య అవార్డులు అందుకోనున్నారు.

దినేశ్ జవహర్ లాల్ లాడ్, బిమల్ ప్రఫుల్, రాజ్ సింగ్ ...జీవనసాఫల్య పురస్కారాలు పొందనున్నారు.

జూడో ప్లేయర్ సుశీలా దేవి, చెస్ వండర్ ప్రజ్ఞానంద్, దీప్ గ్రేస్ ఎక్కా, సాక్షీకుమార్, అన్షు, తరుణ్ దిల్లాన్,సంజయ్ పాటిల్, జెర్రీన్ అనేకా సైతం అర్జున అవార్డీల జాబితాలో నిలిచారు.

అమృత్‌ సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి మౌలాన అబ్దుల్ కలాం అజాద్ ట్రోఫీని బహుకరించనున్నారు.

ఈనెల 30న రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలను అందచేయనున్నారు. మొత్తం 25 మంది అవార్డీలలో ముగ్గురు తెలుగు క్రీడాకారులు ఉండటం విశేషం.

First Published:  15 Nov 2022 8:56 AM IST
Next Story