ఆసియాక్రీడల క్రికెట్ స్వర్ణాలకు భారత్ గురి!
హాంగ్జు ఆసియాక్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళలజట్లను బీసీసీఐ ప్రకటించింది. పురుషులజట్టుకు రుతురాజ్, మహిళలజట్టుకు హర్మన్ ప్రీత్ నాయకత్వం వహిస్తారు.
హాంగ్జు ఆసియాక్రీడల్లో పాల్గొనే భారత పురుషుల, మహిళలజట్లను బీసీసీఐ ప్రకటించింది. పురుషులజట్టుకు రుతురాజ్, మహిళలజట్టుకు హర్మన్ ప్రీత్ నాయకత్వం వహిస్తారు.....
చైనాలోని హాంగ్జు వేదికగా సెప్టెంబర్ 28న ప్రారంభమయ్యే 19వ ఆసియా క్రీడలలో పాల్గొనే భారతజట్లను బీసీసీఐ ప్రకటించింది. పురుషుల, మహిళల విభాగాలలో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా భారతజట్లు పోటీకి దిగనున్నాయి.
తొమ్మిదేళ్ల తర్వాత ఏషియాడ్ లో క్రికెట్ ...
ఆసియా క్రీడల ప్రధాన అంశాలలో ఒకటిగా లేని క్రికెట్ కు తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత అవకాశం కల్పించారు. పురుషుల, మహిళల విభాగాలలో టీ-20 ఫార్మాట్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీలు నిర్వహించనున్నారు.
గతంలో ఇంచెన్ వేదికగా 2014 లో జరిగిన ఆసియాక్రీడల్లో మాత్రమే క్రికెట్ ను పతకం అంశంగా నిర్వహించారు. ఆ తర్వాత 2018లో జరిగిన జకార్తా ఏషియాడ్ క్రీడల జాబితా నుంచి క్రికెట్ ను తొలగించారు. తిరిగి హాంగ్జు వేదికగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకూ జరిగే 19వ ఆసియాక్రీడల్లో క్రికెట్ కు మెడల్ ఈవెంట్ గా చోటు కల్పించారు.
బలమైనజట్లతో బరిలో భారత్...
ఆసియా క్రీడల పురుషుల, మహిళల విభాగాలలో స్వర్ణపతకాలు సాధించడమే లక్ష్యంగా భారత్ బలమైన జట్లతో పోటీకి దిగుతోంది. మహిళల విభాగంలో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో పూర్తిస్థాయి జట్టుతో పోటీకి దిగుతున్న భారత్..పురుషుల విభాగంలో మాత్రం ద్వితీయ శ్రేణిజట్టుతో తన అదృష్టం పరీక్షించుకోనుంది.
రుతురాజ్ గయక్వాడ్ నాయకత్వంలోని భారత పురుషుల జట్టులో యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, శివం మావీ, శివం దుబే, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నారు.
స్టాంట్ బై ప్లేయర్ల జాబితాలో యశ్ ఠాకూర్, సాయి కిశోర్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్ ఉన్నారు.
మహిళల జట్టు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్...
భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. జట్టులోని ఇతర ప్లేయర్లలో స్మృతి మంధన ( వైస్ కెప్టెన ), షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగేజ్, దీప్తి శర్మ, రిచా ఘోశ్, అమన్ జోత్ కౌర్, దేవిక వైద్య, అంజలీ శ్రావణీస టిటాస్ సాధు, రాజేశ్వరీ గయక్వాడ్, మిన్ను మణి, కనిక అహూజా, ఉమా ఛెత్రీ, అనూష బారెడ్డి ఉన్నారు.
స్టాండ్ బై జాబితాలో హర్లీన్ డియోల్ , కశ్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాకు, పూజా వస్త్రకర్ ఉన్నారు. జీజియాంగ్ యూనివర్శటిలోని పింగ్ ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్ లో
పోటీలు నిర్వహించనున్నారు.
శ్రీలంక, పాకిస్థాన్,బంగ్లాదేశ్ లు సైతం తమ ప్రధాన జట్లతో బంగారు పతకం వేటకు దిగనున్నాయి.