రోహిత్ హాఫ్ సెంచరీ
15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 93/0

న్యూజిలాండ్ నిర్దేశించిన 252 రన్స్ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నారు. జెమీసన్ వేసిన మొదటి ఓవర్‌లోనే 9 రన్స్ వచ్చాయి. రెండో బాల్‌నే రోహిత్ సిక్సర్‌గా మలిచాడు. విలియం ఓరూర్క్ వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. మొదటి రెండు ఓవర్లలోనే 22 రన్స్ చేసిన భారత్ తర్వాత మూడు ఓవర్లలో 9 రన్స్ చేసింది. రోహిత్ సింగిల్స్ కంటే బౌండరీలు బాదడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. నాథన్ స్మిత్ వేసిన ఆరో ఓవర్‌లో సిక్స్ కొట్టిన రోహిత్.. జెమీసన్ వేసిన తర్వాత ఓవర్‌లో బౌండరీ బాదాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 41 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు 58 హాఫ్ సెంచరీ.. ఈ హాఫ్ సెంచరీలో 3 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. 15 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 93/0. రోహిత్ (65*), శుభ్‌మన్ గిల్ (23*) క్రీజులో ఉన్నారు.