Telugu Global
Sports

రోహిత్- విరాట్ జోడీ ప్రపంచ రికార్డు!

భారత స్టార్ బ్యాటింగ్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరీబియన్ గ్రేట్స్ గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ ల పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశారు.

రోహిత్- విరాట్ జోడీ ప్రపంచ రికార్డు!
X

రోహిత్- విరాట్ జోడీ ప్రపంచ రికార్డు!

భారత స్టార్ బ్యాటింగ్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరీబియన్ గ్రేట్స్ గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ ల పేరుతో ఉన్న రికార్డును తెరమరుగు చేశారు.

భారత సూపర్ స్టార్ జోడీ రోహిత్ శర్మ- విరాట్ కొహ్లీ ప్రస్తుత ఆసియాకప్ లో చెలరేగిపోతున్నారు. కెప్టెన్ రోహిత్ లీగ్ దశ నుంచి సూపర్ -4 రౌండ్ మొదటి రెండుమ్యాచ్ ల వరకూ హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధిస్తే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై విరాట్ కొహ్లీ తనదైనశైలిలో సెంచరీతో పాటు 13వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.

కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా శ్రీలంకతో ముగిసిన సూపర్-4 రౌండ్ మ్యాచ్ లో రోహిత్- విరాట్ జోడీ రెండో వికెట్ కు 2 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతోనే ఓ సరికొత్త రికార్డు తెరమీదకు వచ్చింది.

అత్యంత వేగంగా 5వేల పరుగుల రికార్డు....

కరీబియన్ ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ గార్డన్ గ్రీనిడ్జ్- డెస్మండ్ హేన్స్ ల పేరుతో గత మూడుదశాబ్దాల కాలంగా ఉన్న అత్యంత వేగవంతమైన 5వేల పరుగుల రికార్డును భారతజోడీ రోహిత్- విరాట్ అధిగమించడం ద్వారా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పగలిగారు.

వన్డే క్రికెట్ చరిత్రలోనే 5వేల పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన 8వ జోడీగా రికార్డుల్లో చేరారు. అత్యధిక పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన జంటల వరుసలో రోహిత్- విరాట్ మూడోస్థానంలో నిలిచారు.

సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ జోడీతో పాటు రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ల తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు.

8వేల 227 పరుగులతో సచిన్-సౌరవ్ జోడీ టాప్..

భారత ఆల్ టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ 8వేల 227 పరుగుల భాగస్వామ్యంతో ప్రపంచ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.

శ్రీలంకజోడీ మహేల జయవర్థనే- కుమార సంగక్కర 5వేల 992 పరుగులతో రెండోస్థానంలో నిలిచారు.

శ్రీలంకకే చెందిన దిల్షాన్- సంగక్కర జోడీ 5 వేల 475 పరుగులు, అటపట్టు- సనత్ జయసూర్య జోడీ 5వేల 462 పరుగులతో మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నారు.

ఆస్ట్ర్రేలియా జోడీ ఆడం గిల్ క్రిస్ట్- మాథ్యూహేడెన్ 5వేల 409 పరుగులతో ఐదు, గ్రీనిడ్జ్- హేన్స్ జోడీ 5వేల 206 పరుగులతో ఆరు, రోహిత్- ధావన్ జోడీ 5 వేల 193 పరుగులతో ఏడు, రోహిత్- విరాట్ జోడీ 5వేల పరుగులతో ఎనిమిదిస్థానాలలో ఉన్నారు.

అయితే..అత్యంత వేగంగా 5వేల పరుగుల భాగస్వామ్యం తో ప్రపంచ రికార్డు నెలకొల్పిన జోడీగా గ్రీనిడ్జ్- హేన్స్ ల రికార్డును రోహిత్- విరాట్ ల జోడీ తెరమరుగు చేయగలిగారు.

కరీబియన్ జోడీ 97ఇన్నింగ్స్ లో 5వేల పరుగులు సాధిస్తే..రోహిత్- విరాట్ జోడీ కేవలం 86 ఇన్నింగ్స్ లోనే సరికొత్త రికార్డు నెలకొల్పగలిగారు.

First Published:  13 Sep 2023 4:30 AM GMT
Next Story