కంగారూ ల్యాండ్ కు వెడలే టీమిండియా!
ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 16న ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు...ముంబై నుంచి బయలుదేరి వెళ్ళింది.
ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 16న ప్రారంభంకానున్న టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనటానికి రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు...ముంబై నుంచి బయలుదేరి వెళ్ళింది.
ఈనెల 23న భారత్ తన గ్రూప్ ప్రారంభమ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది....
ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో ప్రపంచ టాప్ ర్యాంక్ జట్టు భారత్..మరోసారి ప్రపంచకప్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముంబై నుంచి ఆస్ట్ర్రేలియాకు బయలుదేరింది.
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ నాయకత్వంలో మొత్తం 14మంది సభ్యులజట్టు పెర్త్ నగరానికి చేరుకోనుంది. వెన్నెముక గాయంతో తుదిజట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో 15వ ఆటగాడి పేరును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.
అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ జరుగనున్న 2022 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్లో భారత్ నేరుగా పాల్గోనుంది.
ప్రపంచ క్రికెట్లోని మొత్తం 18మంది అత్యుత్తమజట్ల నడుమ రెండుదశలుగా ఈటోర్నీని నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 16 నుంచి 20 వరకూ జరిగే క్వాలిఫైయింగ్ టోర్నీలో
ఎనిమిదిజట్లు పోటీపడనున్నాయి. రెండోదశగా జరిగే సూపర్ -12 గ్రూప్ లీగ్ రౌండ్లో అగ్రశ్రేణిజట్లు ఢీ కొంటాయి.
భారత్ సత్తాకు అసలు పరీక్ష...
బ్యాటింగ్ లో అత్యంత బలంగాను, బౌలింగ్ లో అత్యంత బలహీనంగాను కనిపిస్తున్న టాప్ ర్యాంకర్ భారత్..ప్రపంచకప్ లో తన తొలిమ్యాచ్ ఆడటానికి ముందు..మూడు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో పాల్గోనుంది.
ఫాస్ట్ , బౌన్సీ పిచ్ కు మరో పేరైన పశ్చిమ ఆస్ట్ర్రేలియాలోని పెర్త్ వేదికగా వెస్టర్న్ ఆస్ట్ర్రేలియాతో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 17న న్యూజిలాండ్, అక్టోబర్ 19న ఆస్ట్ర్రేలియాజట్లతో జరిగే సన్నాహక మ్యాచ్ ల్లో భారత్ తలపడనుంది.
2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టు ...ఆ తర్వాత నుంచి మరో టైటిల్ కోసం గత 15 సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉంది.
గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన 2021 టీ-20 ప్రపంచకప్ సూపర్ -12 రౌండ్ నుంచే నిష్క్ర్రమించిన భారత్..ఈసారి టైటిల్ ఆశలతో కంగారూల్యాండ్ కు బయలుదేరి వెళ్లింది.
ముంబైలో బీసీసీఐ నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో రోహిత్ శర్మ నాయకత్వంలోని మొత్తం 14మంది సభ్యులు, జట్టు సహాయక సిబ్బంది పాల్గొన్నారు
సూపర్ -12 రౌండ్ గ్రూప్ లీగ్ లో భారతజట్టు...దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో పాటు క్వాలిఫైయింగ్ రౌండ్ ద్వారా అర్హత సాధించిన మరో రెండుజట్లతో తలపడనుంది.