Telugu Global
Sports

ఇండోర్ వన్డే లో బుమ్రాకు రెస్ట్...సిరాజ్ కు చోటు!

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో మొహాలీ నుంచి ఇండోర్ కి చేరింది. ఈ సూపర్ సండే ఫైట్.. ఆతిథ్య భారత్ కు చెలగాటం, ఆస్ట్ర్రేలియాకు సిరీస్ సంకటంగా మారింది.

ఇండోర్ వన్డే లో బుమ్రాకు రెస్ట్...సిరాజ్ కు చోటు!
X

భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ షో మొహాలీ నుంచి ఇండోర్ కి చేరింది. ఈ సూపర్ సండే ఫైట్.. ఆతిథ్య భారత్ కు చెలగాటం, ఆస్ట్ర్రేలియాకు సిరీస్ సంకటంగా మారింది.

భారత్ వేదికగా మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ వన్జే ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల మధ్య జరుగుతున్న తీన్మార్ వన్డే సిరీస్ హాట్ హాట్ గా మారింది.

మొహాలీ వేదికగా ముగిసిన తొలివన్డేలో భారత్ 5 వికెట్లతో నెగ్గడం ద్వారా 1-0తో సిరీస్ పై పట్టు బిగించడంతో ఈరోజు జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలంటే ఈ రెండోవన్డేలో ఆస్ట్ర్రేలియా నెగ్గితీరాల్సి ఉంది.

భారత ఓపెనింగ్ జోడీలో మార్పు?

తొలివన్డేలో శుభ్ మన్ గిల్ తో జంటగా భారత ఇన్నింగ్స్ ప్రారంభించి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసిన రుతురాజ్ గయక్వాడ్ అందుబాటులో లేకపోడంతో..ఇషాన్ కిషన్ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగనున్నాడు. ఆసియాక్రీడల్లో పాల్గొంటున్న భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ నాయకత్వం వహిస్తున్న కారణంగా ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి రెండువన్డేలకు అందుబాటులో లేకుండా పోయాడు.

దీంతో..ఇప్పటి వరకూ మిడిలార్డర్లో ఆడుతూ వచ్చిన ఇషాన్ కిషన్..ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగనున్నాడు.

సూపర్ ఫామ్ లో భారత ఆటగాళ్లు...

శ్రీలంక వేదికగా ముగిసిన 2023 ఆసియాకప్ ఫైనల్స్ నుంచి భారతజట్టు గాడిలో పడినట్లే కనిపిస్తోంది. ఓపెనర్ల నుంచి మిడిలార్డర్ బ్యాటర్ల వరకూ, ఓపెనింగ్ బౌలర్ల నుంచి స్పిన్నర్ల వరకూ..అందరూ ఫామ్ లోకి రావడం భారత్ కు సానుకూల అంశంగా మారింది.

శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ లాంటి ప్రధాన బ్యాటర్లు ఫామ్ లో ఉండడంతో భారత బ్యాటింగ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

మరోవైపు..గత నాలుగు వన్డేలలోనూ పరాజయాలు చవిచూసిన కంగారూలు ఓటమి ఊబినుంచి బయటపడాలన్న పట్టుదలతో ఉన్నారు. భారత్ తో జరిగే కీలక రెండోవన్డేలో నెగ్గడం ద్వారా వరుస పరాజయాలకు స్వస్తి పలకడంతో పాటు..ప్రస్తుత సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో ఉంది.

తురుపుముక్కలు లేకుండానే మరోసారి పోరు...

రెండుజట్లూ పలువురు కీలక ఆటగాళ్లు లేకుండా వరుసగా రెండోసారి తలపడబోతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, స్పిన్ జాదూ కుల్దీప్ యాదవ్ లకు భారత టీమ్ మేనేజ్ మెంట్ విశ్రాంతి నిస్తే..ఆస్ట్ర్రేలియా సైతం మెరుపు ఫాస్ట్ బౌలర్ మిషెల్ స్టార్క్, డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ లు లేకుండా పోటీకి దిగుతోంది.

ఆస్ట్ర్రేలియా టాపార్డర్ లో కనీసం ఇద్దరు బ్యాటర్లు భారీఇన్నింగ్స్ ఆడగలిగితేనే భారత్ కు పోటీ ఇవ్వగలుగుతుంది. ఓపెనింగ్ జోడీ వార్నర్- మార్ష్ తమ బ్యాట్లకు పూర్తిస్థాయిలో పని చెబితే..భారత బౌలర్లకు చేతినిండా పనే అనడంలో సందేహం లేదు.

భారీస్కోర్ల అడ్డా ఇండోర్.....

బ్యాటింగ్ స్వర్గధామంగా పేరుపొందిన ఇండోర్ పిచ్ పైన రెండుజట్ల బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. 300కు పైగా స్కోర్లను అలవోకగా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

ముందుగా టాస్ నెగ్గినజట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహ్మద్ షమీ, బుమ్రా, అశ్విన్, జడేజాలతో కూడిన భారత బౌలింగ్ ఎటాక్ సత్తాకు సవాలు కానుంది.

ఇదే గ్రౌండ్ వేదికగా 2011లో జరిగిన మ్యాచ్ లో అప్పటి భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 219 పరుగుల భారీస్కోరు సాధించాడు. 2018లో రోహిత్ శర్మ కేవలం 36 బంతుల్లోనే మెరుపు శతకం సాధించడం, భారత్ 400కు పైగా పరుగులు సాధించడం చూస్తే ..ప్రస్తుత సిరీస్ లోని ఈ మ్యాచ్ లో సైతం పరుగుల వర్షంతో పాటు భారీస్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇండోర్ స్టేడియం గ్రౌండ్ బౌండ్రీలు 70 మీటర్లు, స్క్వేర్ బౌండ్రీలు 60 మీటర్లే ఉండడంతో బౌండ్రీల హోరు, సిక్సర్ల జోరుతో మ్యాచ్ సాగనుంది. భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ కు ఇండోర్ వేదికగా గతంలో ఆడిన వన్డేలో శతకం సాధించిన అనుభవం ఉంది.

బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉన్న ఇక్కడి పిచ్ పైన రెండుజట్లూ పరుగుల మోత మోగించడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడుమ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే భారత్ 1-0తో పైచేయి సాధించడంతో...ఈ సూపర్ సండే ఫైట్ భారత్ కు చెలగాటం...ఆస్ట్ర్రేలియాకు సిరీస్ సంకటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

First Published:  24 Sept 2023 1:30 PM IST
Next Story