Telugu Global
Sports

రచిన్‌ క్లీన్‌బౌల్డ్‌.. విలియమ్సన్‌ రిటర్న్‌ క్యాచ్‌

కీలక వికెట్లు తీసి కివీస్‌ను కష్టాల్లోకి నెట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌

రచిన్‌ క్లీన్‌బౌల్డ్‌.. విలియమ్సన్‌ రిటర్న్‌ క్యాచ్‌
X

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన రచిన్‌ రవీంద్ర, విల్‌ యంగ్‌ నిలకడగా ఆడుతున్నారు. ప్రారంభంలో కొద్దిగా ఆచితూచి ఆడిన రచిన్‌ రవీంద్ర దూకుడు పెంచాడు. హర్దిక్‌ బౌలింగ్‌(4 ఓవర్‌)లో ఏకరంగా రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టాడు. షమీ వసిన 5 ఓవర్‌లోనూ రెండు ఫోర్లు కొట్టాడు. రచిన్‌ 2 రన్స్‌ వద్ద ఉన్నప్పుడే మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇప్పటివరకు అత్యధిక రన్స్‌ చేసిన బ్యాటర్‌గా రచిన్‌ రవీంద్ర నిలిచాడు. బెన్‌ డకెట్‌ (227) ను రచిన్‌ (228) వెనక్కి నెట్టాడు. అయితే వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ (7.5 ఓవర్‌)లో 57 రన్స్‌ వద్ద న్యూజిలాండ్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ (15) ఎల్బీ అయ్యాడు. డీఆర్‌ఎస్‌ తీసుకోకుండానే కివీస్‌ ఓపెనర్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. ఇదే ఓవర్‌లో రచిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయాస్‌ చేజార్చాడు. దూకుడుగా ఆడుతున్న రచిన్‌ (37) ను కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌కు వచ్చిన మొదటి బంతికే సూపర్‌ డెలివరీతో క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 69 రన్స్‌ వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ కొంచెం నెమ్మదించింది. ఈక్రమంలోనే కుల్‌ దీప్‌ యాదవ్‌ ఖాతాలో మరో వికెట్‌ పడింది. రిటర్న్‌ క్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ ను పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 75 రన్స్‌ వద్ద న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది.

First Published:  9 March 2025 3:43 PM IST
Next Story