ప్రో-కబడ్డీ లీగ్ వేలంలో 10వ సీజన్ వేలంలో రికార్డు ధర!
కబడ్డీలీగ్ సీజన్ -10 వేలంలో సంచలన రైడర్ పవన్ షెరావత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2 కోట్ల 60 లక్షల రూపాయల ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.
కబడ్డీలీగ్ సీజన్ -10 వేలంలో సంచలన రైడర్ పవన్ షెరావత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 2 కోట్ల 60 లక్షల రూపాయల ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు.
భారత గడ్డపై గత తొమ్మిది సీజన్లుగా జరుగుతున్న ప్రోఫెషనల్ కబడ్డీ లీగ్ కొత్తపుంతలు తొక్కుతోంది. ఐపీఎల్ తర్వాత అత్యంత జనాదరణ పొందుతున్న కబడ్డీలీగ్ కాలానుగుణంగా మారుతూ రికార్డులకు ఆలవాలంగా మారింది.
2023 సీజన్ కోసం ముంబై వేదికగా నిర్వహించిన వేలంలో భారత సంచలన రైడర్ పవర్ షెరావత్ కు కళ్లు చెదిరే ధర పలికింది.
హాటు కేకుల్లా ఇరానీ ప్లేయర్లు...
ప్రో-కబడ్డీ లీగ్ 10వ సీజన్ కోసం నిర్వాహక మషాల్ స్పోర్ట్స్ ముంబైలో నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో పవన్ షెరావత్ గత 9 సీజన్లలో లేనివిధంగా 2 కోట్ల 60 లక్షల రూపాయల ధరపలికింది.
' హై ఫ్లయర్ ' కబడ్డీ అభిమానులు పిలుచుకొనే పవన్ షెరావత్ ను తెలుగు టైటాన్స్ యాజమాన్యం వేలం ద్వారా 2 కోట్ల 60 లక్షల రూపాయల ధరకు ఖాయం చేసుకొంది.
కొద్దిరోజుల క్రితమే హాంగ్జు వేదికగా ముగిసిన ఆసియాక్రీడల కబడ్డీ పురుషుల విభాగంలో భారత్ నాలుగేళ్ల విరామం తర్వాత బంగారు పతకం గెలుచుకోడంలో పవన్ షెరావత్ కీలకపాత్ర పోషించాడు.
కోటి రూపాయల క్లబ్ లో ఐదుగురు ప్లేయర్లు...
ఇరాన్ సూపర్ స్టార్ ప్లేయర్లు మహ్మద్ రెజా కు అత్యధికంగా 2 కోట్ల 35 లక్షల రూపాయల ధర పలికింది. అత్యధిక వేలం ధర సంపాదించిన విదేశీ ఆటగాళ్లలో మహ్మద్ రెజా అగ్రస్థానంలో నిలిచాడు.
పవన్ షెరావత్ తో పాటు మొత్తం ఐదుగురు ఆటగాళ్లకు కోటి రూపాయలకు పైగా వేలం ధర దక్కడం విశేషం. ఇరానీ డిఫెండర్ కమ్ సూపర్ క్యాచర్ ఫజల్ అట్రాచలీని కోటీ 60 లక్షల రూపాయలకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకొంది.
మనిందర్ సింగ్, సిద్ధార్ధ దేశాయ్ లు సైతం కోటిరూపాయలు ధర మించిన ఆటగాళ్లలో ఉన్నారు.
వేలం రేసులో 12 ఫ్రాంచైజీలు....
మొత్తం 23 మంది అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం 12 ఫ్రాంచైజీలు పోటీకి దిగాయి. కబడ్డీ ప్లేయర్లు సైతం లక్షల రూపాయల ధర నుంచి కోట్ల రూపాయల ధరకు చేరుకోగలగడం తమకు గర్వకారణమని నిర్వాహక సంఘం చెబుతోంది.
డిసెంబర్ 2 నుంచి దేశంలోని 12 నగరాలు వేదికలుగా 12 జట్లతో ప్రో-కబడ్డీ లీగ్ 10వ సీజన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి.