Telugu Global
Sports

హైదరాబాద్ నుంచి పాక్ అందాల యాంకర్ పలాయనం!

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్ ల కవరేజి కోసం వచ్చిన పాకిస్థాన్ అందాల యాంకర్ జియానాబ్ అబ్బాస్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది.

హైదరాబాద్ నుంచి పాక్ అందాల యాంకర్ పలాయనం!
X

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్ ల కవరేజి కోసం వచ్చిన పాకిస్థాన్ అందాల యాంకర్ జియానాబ్ అబ్బాస్ కు చేదుఅనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్ నుంచి స్వదేశానికి పలాయనం చిత్తగించింది....

ప్రింట్, ఎలక్ట్ర్రానిక్ మీడియా జర్నలిస్టులకు, యాంకర్లు, ప్రెజెంటర్లకు ప్రపంచకప్ క్రికెట్ పోటీలను కవరేజ్ చేయటం ఓ కల. ఆ అందమైన కలను సాకారం చేసుకోడానికి..

భారత్ లోని హైదరాబాద్ నగరానికి వచ్చిన పాకిస్థాన్ అందాల యాంకర్ జియానాబ్ అబ్బాస్ కు మాత్రం భారత పర్యటన చేదుఅనుభవంగా, పీడకలగా మిగిలిపోయాయి.

ప్రపంచ మాజీ చాంపియన్ పాకిస్థాన్ తన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లను హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ప్రధాన కేంద్రంగా ఆడుతోంది. ప్రాక్టీసు మ్యాచ్ లతో పాటు పలు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లను సైతం హైదరాబాద్ వేదికగానే పాక్ జట్టు ఆడనుంది. ఇప్పటికే హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్ తో ఆడిన ప్రారంభమ్యాచ్ లో విజయం సైతం సొంతం చేసుకొంది.

ప్రాణభయంతో స్వదేశానికి.....

హైదరాబాద్ వేదికగా తమజట్టు ఆడే మ్యాచ్ ల కవరేజ్ కోసం పాకిస్థాన్ కు చెందిన అందాల స్పోర్ట్స్ యాంకర్ కమ్ ప్రెజెంటర్ ఎన్నో ఆశలతో భారత్ కు తరలి వచ్చింది.

అయితే..గతంలో సోషల్ మీడియా ద్వారా భారత్ గురించి, హిందూ మతం గురించి జియానాబ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఆమె పాలిట గుదిబండగా మారాయి.

భారత కోర్టుల్లో జియానాబ్ పై గతంలోనే పలు కేసులు నమోదై ఉన్నాయి. జియానాబ్ వివాదాస్పద వ్యాఖ్యలు గతంలో సమా టీవీ ద్వారా ప్రసారమయ్యాయి.

జియానాబ్ అబ్బాస్ గతంలో చేసిన వ్యాఖ్యలపై భారత లాయర్ వినీత్ జిందాల్ దాఖలు చేసిన కేసు గురించి తెలియడంతో తనను ఎక్కడ అరెస్టు చేస్తారో, అభిమానులు తనపై దాడి చేస్తారేమో అన్న భయంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోయింది. పాపం..జియానాబ్ ప్రపంచకప్ కవరేజ్ కేవలం ఒక్కమ్యాచ్ ముచ్చటగా మిగిలిపోయింది.

పాకిస్థాన్ విఖ్యాత యాంకర్ గా...

1988లో లాహోర్ లో జన్మించిన జియానాబ్ తండ్రి నాసిర్ అబ్బాస్ పాక్ దేశవాళీ క్రికెట్లో మాజీ ఆటగాడు. తల్లి అందాలీబ్ అబ్బాస్ రాజకీయనాయకురాలు. బర్మింగ్ హామ్ లోని ఆస్టన్ విశ్వవిద్యాలయంలో ఎంబీయే చదివిన జియానాబ్ 2015లో తన కెరియర్ ను మేకప్ ఆర్టిస్టుగా మొదలు పెట్టింది. ఆ తర్వాత ప్రపంచకప్ క్రికెట్ షో కార్యక్రమం నిర్వహించడానికి యాంకర్ కమ్ ప్రెజెంటర్ గా ఎంపికయ్యింది.

క్రికెట్ పట్ల సంపూర్ణ అవగాహన కు తన అందాన్ని జోడించి జనరంజక యాంకర్ గా గుర్తింపు సంపాదించింది. ఇప్పటికే పలు రకాల అవార్డులు గెలుచుకొన్న జియానాబ్

కోసమే ప్రపంచ వ్యాప్తంగా టీవీ కార్యక్రమాలు వీక్షించే అభిమానులున్నారు.

అయితే.. హిందూ మతాన్ని, భారత్ ను ఎద్దేవా చేస్తూ గతంలో తాను చేసిన నోటిదురుసు వ్యాఖ్యలే...జియానాబ్ పాలిట శాపంగా మారాయి.

First Published:  10 Oct 2023 9:00 AM IST
Next Story