ఐసీసీ టోర్నీలకు ఇండియాకు వెళ్లమనడం కరెక్ట్ కాదు
భారత్ ను సొంత గడ్డపైనే ఓడించేలా పాక్ టీమ్‌ను తీర్చిదిద్దాలే : మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ అక్తర్
BY Naveen Kamera2 Dec 2024 6:44 PM IST
X
Naveen Kamera Updated On: 2 Dec 2024 6:44 PM IST
భారత్ ను సొంగ గడ్డపైనే ఓడించేలా పాక్ టీమ్‌ను తీర్చిదిద్దాలే తప్ప.. ఐసీసీ టోర్నీలకు ఇండియాకు వెళ్లబోమని చెప్పడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని మాజీ స్టార్ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే ఎక్కువ ఫీజు చెల్లించాలని పాక్ పట్టుబట్టడం మంచిదేనని.. అదే సమయంలో ఇండియా గడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీలకు వెళ్లబోమని.. ఆ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికపై నిర్వహించాలని పట్టుబట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. 2026 టీ 20 వరల్డ్ కప్, 2029లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2031లో ఐసీసీ వన్‌డే వరల్డ్ కప్‌లకు భారత్ ఆథిత్యం ఇవ్వబోతుంది. ఈ టోర్నీల్లోనూ తాము భారత గడ్డపై ఆడబోమని.. తమ మ్యాచ్‌లను దుబయి వేదికగా నిర్వహించాలని పాకిస్థాన్ కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.
Next Story