Telugu Global
Sports

ఒలింపిక్స్ అర్హత హాకీ టో్ర్నీ సెమీస్ లో భారత్!

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఆఖరి గ్రూప్ పోటీలో భారత్ 5-1 గోల్స్ తో ఇటలీని చిత్తు చేయడం ద్వారా నాకౌట్ రౌండ్లో చోటు సంపాదించింది. భారత్ దే పైచేయిగా సాగిన ఈ పోటీ తొలినిముషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ ను ఉదితా గోలుగా మలచి 1-0 ఆధిక్యంతో శుభారంభాన్ని ఇచ్చింది.

ఒలింపిక్స్ అర్హత హాకీ టో్ర్నీ సెమీస్ లో భారత్!
X

పారిస్ ఒలింపిక్స్ అర్హత కోసం జరుగుతున్న మహిళా అంతర్జాతీయ హాకీ టోర్నీ సెమీస్ కు ఆతిథ్య భారత్ చేరుకొంది. ఫైనల్లో చోటు కోసం జర్మనీతో అమీతుమీ తేల్చుకోనుంది.

2024-పారిస్ ఒలింపిక్స్ అర్హత కోసం భారతహాకీ మహిళాజట్టు పోరాడుతోంది. రాంచీ వేదికగా జరుగుతున్న ఎనిమిదిదేశాల అంతర్జాతీయ అర్హత టోర్నీ గ్రూపులీగ్ లో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది.

అమెరికా, న్యూజిలాండ్, ఇటలీజట్లు ప్రత్యర్థులుగా ఉన్న గ్రూప్- బీ లీగ్ లో భారత్ మూడురౌండ్లలో రెండు విజయాలతో అమెరికా తరువాతి స్థానంలో నిలవడం ద్వారా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకొంది.

ఆఖరిరౌండ్లో ఇటలీపై భావిజయం....

మొత్తం 8 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ మొదటి మూడుస్థానాలలో నిలిచినజట్లకు మాత్రమే పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. సెమీఫైనల్స్ చేరిన నాలుగుజట్లలో మూడింటికి మాత్రమే ఒలింపిక్స్ బెర్త్ ఖాయమవుతుంది.

సెమీస్ చేరాలంటే నెగ్గితీరాల్సిన ఆఖరి గ్రూప్ పోటీలో భారత్ 5-1 గోల్స్ తో ఇటలీని చిత్తు చేయడం ద్వారా నాకౌట్ రౌండ్లో చోటు సంపాదించింది. భారత్ దే పైచేయిగా సాగిన ఈ పోటీ తొలినిముషంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ ను ఉదితా గోలుగా మలచి 1-0 ఆధిక్యంతో శుభారంభాన్ని ఇచ్చింది.

ఆట 41వ నిముషంలో దీపిక, 45వ నిముషంలో సలీమా టీటీ, 53వ నిముషంలో నవనీత్ కౌర్, 55వ నిముషంలో ఉదిత గోల్స్ సాధించడంతో భారత్ భారీవిజయం నమోదు చేయగలిగింది.

ఆట ముగిసే క్షణాలలో ఇటలీ తరపున కామిల్లా పెనాల్టీ స్ట్రోక్ గోలుతో భారత్ ఆధిక్యాన్ని 5-1కి తగ్గించగలిగింది.

ఈ విజయంతో భారత్ మొత్తం ఆరుపాయింట్లతో గ్రూప్ టాపర్ అమెరికా తరువాత స్థానంలో నిలవడం ద్వారా సెమీస్ కు అర్హత సంపాదించింది.

ఓటమి నుంచి వరుస విజయాలతో....

గ్రూప్ లీగ్ ప్రారంభమ్యాచ్ లో అమెరికాతో పోరాడి 1-0తో ఓడిన భారత్...కీలక రెండోమ్యాచ్ లో న్యూజిలాండ్ ను 3-1 గోల్స్ తో అధిగమించడం ద్వారా పుంజుకోగలిగింది. అమెరికా మూడుకు మూడురౌండ్లలోనూ నెగ్గడం ద్వారా 9 పాయింట్లతో గ్రూప్ టాపర్ గా సెమీస్ చేరింది.

గ్రూప్- ఏ లీగ్ నుంచి జర్మనీ, జపాన్ నాకౌట్ రౌండ్ చేరాయి. సెమీస్ పోరులో జర్మనీతో భారత్, అమెరికాతో జపాన్ తలపడనున్నాయి.

హాంగ్జు వేదికగా ముగిసిన ఆసియాక్రీడల హాకీ పురుషుల విభాగంలో భారత్ బంగారు పతకం గెలుచుకోడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగా మహిళల జట్టు మాత్రమే క్వాలిఫైయింగ్ రౌండ్లో పోరాడాల్సి వస్తోంది.

First Published:  18 Jan 2024 12:00 PM GMT
Next Story