టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
మూడో టెస్ట్ లో బూమ్రాకు విశ్రాంతి ఇచ్చిన భారత్.. రెండు మార్పులు చేసిన న్యూజిలాండ్
భారత్, న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో మూడో టెస్ట్ జరగనున్నది. టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది.మొదటిరోజు బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, తర్వాత స్పిన్‌కు సహకరిస్తుందనే ఉద్దేశంతో ఆథిత్య జట్టు ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే 2-0 టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా.. చివరి టెస్ట్‌లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ముందుకు సాగాలంటే ఈ విజయం భారత్‌కు అత్యవసరం. స్టార్ పేసర్ బూమ్రాకు మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో పేస్ విభాగాన్ని సిరాజ్, ఆకాశ్‌దీప్ నడిపించనున్నారు. అలాగే కివీస్ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. సౌథీకి బదులు హెన్రీ.. శాంట్నర్ స్థానంలో ఐష్ సోధికి అవకాశం దక్కింది.
తుది జట్లు ఇవే
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషభ్‌పంత్ (కీపర్) సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, సిరాజ్
న్యూజిలాండ్: టామ్ లేథమ్ (కెప్టెన్), డేవన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఒరోర్కీ