ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచిన కివీస్
వరుసగా 15వ సారి టాస్ కోల్పోయిన టీమిండియా

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఫైనల్‌కు చేరిన ఏకైనా జట్టు భారతే కావడం గమనార్హం. వరుసగా 15వ సారి టాస్ కోల్పోయిన భారత్.అత్యధిక వన్డేల్లో టాస్ కోల్పోయిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. గత వన్డే ప్రపంచకప్ నుంచి ఇప్పటివరకు 12 మ్యాచుల్లో టాస్ ఓడాడు. బ్రియాన్ లారా (అక్టోబర్ 1998 నుంచి మే 1999) 12 సార్లు, పీటర్ బోరెన్ (మార్చి 2011-ఆగస్టు 2013) 11 సార్లు టాస్ ఓడాడు. గాయం కారణంగా మ్యాట్ హెన్నీ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.దీంతో తుది జట్టులోకి నాథన్ స్మిత్‌కు అవకాశం లభించింది.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారీ మిచెల్, టామ్ లేథమ్, గ్లెన్ ఫిలిప్స్, బార్స్‌వెల్, శాంట్నర్, కైల్ జెమిసన్, విలయమ్ ఓర్క్, నాథన్ స్మిత్