Telugu Global
Sports

నేటినుంచే నీరజ్ చోప్రా ప్రపంచ టైటిల్ వేట!

బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా తన ప్రపంచ తొలి టైటిల్ కు గురిపెట్టాడు. బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల బరిలో హాట్ ఫేవరెట్ గా నిలిచాడు.

నీరజ్ చోప్రా
X

నీరజ్ చోప్రా

బల్లెం విసురుడులో భారత బాహుబలి నీరజ్ చోప్రా తన ప్రపంచ తొలి టైటిల్ కు గురిపెట్టాడు. బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల బరిలో హాట్ ఫేవరెట్ గా నిలిచాడు...

హంగెరీ రాజధాని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 2023 ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ పురుషుల జావలిన్ త్రో బరిలోకి హాట్ ఫేవరెట్ గా దిగుతున్నాడు.

ఇప్పటికే ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల బంగారు పతకాలతో పాటు..డైమండ్ లీగ్ గోల్డ్ మెడల్ విన్నర్ గా నిలిచిన నీరజ్ ప్రపంచ తొలి టైటిల్ కోసం తహతహలాడుతున్నాడు.

26 మందితో నీరజ్ ' బంగారు' పోటీ...

ప్రపంచ జావలిన్ త్రో బంగారు పతకం కోసం మరో 11 మంది దిగ్గజ అథ్లెట్లతో నీరజ్ చోప్రా పోటీపడుతున్నాడు. ప్రస్తుత సీజన్లో నీరజ్ అత్యుత్తమంగా 88.67 మీటర్ల రికార్డును నమోదు చేశాడు.

బరిలో నిలిచిన మొత్తం 12 మందిని రెండుగ్రూపులుగా విభజించి క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలు నిర్వహిస్తున్నారు. క్వాలిఫైయింగ్ రౌండ్ దశలో నీరజ్ గ్రూప్ - ఏ లో మరో ఐదుగురు ప్రత్యర్థులతో కలసి పోటీకి దిగుతున్నాడు.

కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, పాక్ మేటి అథ్లెట్ అర్షద్ నదీమ్ గ్రూప్ -బీ లో పోటీకి దిగుతున్నాడు. 2021 ప్రపంచ పోటీలలో రజత పతకం మాత్రమే సాధించిన నీరజ్..ప్రస్తుత పోటీలలో బంగారు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈరోజు ప్రారంభమయ్యే క్వాలిఫైయింగ్ రౌండ్లలో 83మీటర్ల దూరాన్ని అర్హత మార్కుగా నిర్ణయించారు. క్వాలిఫైయింగ్ రౌండ్లలో తలపడే మొత్తం 27 మంది నుంచి ఫైనల్ రౌండ్ కు 12 మంది అత్యుత్తమ అథ్లెట్లు అర్హతసాధించనున్నారు.

భారత్ తరపున బరిలో ముగ్గురు....

ప్రపంచ జావలిన్ త్రో బరిలో నీరజ్ చోప్రాతో పాటు నిలిచిన భారత అథ్లెట్లలో మను, కిశోర్ జేనా ఉన్నారు. 2023 ఆసియా చాంపియన్షిప్ లో రజత విజేతగా నిలిచిన మను గ్రూపు- ఏలోనూ, కిశోర్ జెనా గ్రూప్- బీలోను పోటీపడుతున్నారు.

మహిళల 100 మీటర్ల హర్డల్స్ విభాగంలో భారత్ కే చెందిన జ్యోతి ఎర్రాజీ సెమీఫైనల్స్ చేరుకోడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో ఇప్పటి వరకూ భారత్ కు చెందిన అథ్లెట్లు కనీసం ఒక్క పతకమూ సాధించలేకపోయారు. నీరజ్ చోప్రా మినహా మిగిలిన అథ్లెట్లు పతకం సాధించగల అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయి.

పురుషుల జావలిన్ త్రో క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలను శుక్ర, శనివారాలలోనూ, ప్రపంచ టైటిల్ రౌండ్ ను ఆదివారం నిర్వహిస్తారు.

First Published:  25 Aug 2023 1:00 PM IST
Next Story