Telugu Global
Sports

ధోనీకి ఎమ్‌సిసి గౌరవం!

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా మరో నలుగురు భారత క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది.

ధోనీకి ఎమ్‌సిసి గౌరవం!
X

భారత క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా మరో నలుగురు భారత క్రికెటర్లకు అరుదైన గౌరవం దక్కింది....

జెంటిల్మెన్ గేమ్ క్రికట్ కు ఎమ్‌సిసి (మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ )కి అవినాభావసంబంధం ఉంది. క్రికెట్ నియమావళిని రూపొందించిన మెర్లీబోన్ క్రికెట్ క్లబ్..అంతర్జాతీయ స్థాయిలో ఈ క్రీడకు అసాధారణ సేవలు అందించిన వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లకు జీవితకాల గౌరవసభ్యత్వం ఇస్తూ గౌరవిస్తూ వస్తోంది.

ఆ పరంపరలో భాగంగా..భారత పురుషుల, మహిళా క్రికెట్ కు చెందిన ఐదుగురికి తమ క్లబ్ లో జీవితకాల సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించింది. క్రికెట్ మక్కాగా పేరుపొందిన లండన్ లార్డ్స్ స్టేడియంలో ఎమ్‌సిసి తన విధులు నిర్వర్తిస్తూ వస్తోంది.

19 మంది క్రికెటర్లకు గౌరవసభ్యత్వం..

టెస్టు హోదా పొందిన ఎనిమిది దేశాలకు చెందిన మొత్తం 19 మంది పురుషస మహిళా క్రికెటర్ల కు తమ క్లబ్ లో జీవితకాల సభ్యత్వం ఇస్తున్నట్లు మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ సీఈవో కమ్ సెక్రటరీ గే లావెండర్ ప్రకటించారు.

భారత జట్టును రెండు వేర్వేరు ప్రపంచకప్ టోర్నీలలో విజేతగా నిలపడంతో పాటు టెస్టు క్రికెట్లో టాప్ ర్యాంక్ లో నిలిపిన భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ..

తన వ్యక్తిత్వం, ఆటతీరుతో ఈ క్రీడకే వన్నెతెచ్చారని ఎమ్ సీసీ ప్రశంసించింది.

ధోనీతో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, మహిళా క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలను సైతం గౌరవసభ్యత్వం వరించింది.

వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు తమ జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తుగా ఈ సభ్యత్వం కల్పిస్తున్నట్లు ఎమ్ సిసీ తన వెబ్ సైట్ లో వివరించింది.

మిథాలీరాజ్ రెండుదశాబ్దాలపాటు భారత మహిళా క్రికెట్ కు అసాధారణ సేవలు అందించిందని,211 వన్డేలలో 7 వేల 805 పరుగులు సాధించడం అపూర్వమంటూ కొనియాడింది.

2007 ఐసీసీ టీ-20, 2011 ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీలలో సురేశ్ రైనా, యువరాజ్ సత్తా చాటుకోడమే కాదు..తమ జట్లను విశ్వవిజేతలుగా నిలపడంలో కీలకపాత్ర పోషించారని క్లబ్ వివరించింది.

సురేశ్ రైనా తన 13 సంవత్సరాల క్రికెట్ వన్డే కెరియర్ లో 5వేల 500 పరుగులు సాధించాడని ఎమ్ సీసీ గుర్తు చేసింది.

గౌరవ సభ్యత్వం పొందిన ఇతర దేశాల మేటి క్రికెటర్లలో మెరిసా అగ్యులేరా, జెన్నీ గున్ , లారా మార్ష్, అన్యా స్రుబ్ సోల్, నోయిన్ మోర్గాన్, కెవిన్ పీటర్సన్, మహ్మద్ హఫీజ్, ముషరఫే మోర్తాజా, డేల్ స్టెయిన్, రాచెల్ హేన్స్, యామీ సాట్ వెయిట్, రోజ్ టేలర్ ఉన్నారు.

భారత్ తో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెటర్లు ఇక..ప్రతిష్టాత్మక మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ లో గౌరవసభ్యులుగా ఉండనున్నారు.

First Published:  6 April 2023 1:24 PM IST
Next Story