Telugu Global
Sports

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు.. ఫైనల్ వేదిక అహ్మదాబాద్

క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నది.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో మూడు మ్యాచ్‌లు.. ఫైనల్ వేదిక అహ్మదాబాద్
X

ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌కు ఇండియా నాలుగో సారి ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఇండియాలో మాత్రమే నిర్వహించనున్న తొలి వన్డే వరల్డ్ కప్ ఇదే కావడం గమనార్హం. 1987లో తొలిసారి పాకిస్తాన్‌తో, 1996లో పాకిస్తాన్, శ్రీలంకతో.. 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్ వన్డే వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి కేవలం ఇండియా మాత్రమే ఆతిథ్యం ఇవ్వనున్నది.

ఈ రోజు నుంచి వరల్డ్ కప్ ప్రారంభానికి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్, బీసీసీఐ కార్యదర్శి జై షా పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 5 నుంచి 46 రోజుల పాటు సాగనున్న వన్డే వరల్డ్ కప్‌లో 10 జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం 8 జట్లు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయ్యాయి. ప్రస్తుతం జింబాబ్వేలో జరుగుతున్న వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్ జూలై 9న ముగియనున్నది. ఆ టోర్నీ నుంచి రెండు జట్లను వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి.

వన్డే వరల్డ్ కప్‌లో ప్రతీ జట్టు తొమ్మిది రౌండ్ రాబిన్ మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 4 జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. నాకౌట్ దశలో రెండు సెమీస్, ఒక ఫైనల్ ఉంటుంది. అక్టోబర్ 5న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, గత ఫైనల్‌లో ఓడిన న్యూజిలాండ్ జట్లు అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. ఇక భారత జట్టు తొలి మ్యాచ్ అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడుతుంది.

క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగనున్నది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. అక్టోబర్ 6న పాకిస్తాన్, క్వాలిఫయర్ -1 మధ్య జరిగే మ్యాచ్.. అక్టోబర్ 9న న్యూజీలాండ్, క్వాలిఫయర్ -1 మధ్య జరిగే మ్యాచ్.. అక్టోబర్ 12న పాకిస్తాన్, క్వాలిఫయర్ -2 మధ్య మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నది. తెలంగాణలో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే అంచనాల మేరకు.. అక్టోబర్ 13 తర్వాత ఎలాంటి మ్యాచ్‌లు కేటాయించలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.

కాగా, వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జరిగే వార్మప్ మ్యాచ్‌లకు హైదరాబాద్, తిరువునంతపురం, గౌహతి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య జరగనున్నాయి.

ఈ సారి వరల్డ్ కప్ మ్యాచ్‌లకు హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి సెమీ ఫైనల్ నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో, రెండో సెమీఫైనల్ నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నది. నాకౌట్ దశలోని ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ తెలిపింది.

పూర్తి షెడ్యూల్..

అక్టోబర్ 5 - ఇంగ్లాండ్ Vs న్యూజీలాండ్ - అహ్మదాబాద్

అక్టోబర్ 6 - పాకిస్తాన్ Vs క్వాలిఫయర్ 1 - హైదరాబాద్

అక్టోబర్ 7 - బంగ్లాదేశ్ Vs ఆఫ్గానిస్తాన్ - ధర్మశాల

అక్టోబర్ 7 - సౌతాఫ్రికా Vs క్వాలిఫయర్ 2 - ఢిల్లీ

అక్టోబర్ 8 - ఇండియా Vs ఆస్ట్రేలియా - చెన్నై

అక్టోబర్ 9 - న్యూజీలాండ్ Vs క్వాలిఫయర్ 1 - హైదరాబాద్

అక్టోబర్ 10 - ఇంగ్లాంగ్ Vs బంగ్లాదేశ్ - ధర్మశాల

అక్టోబర్ 11 - ఇండియా Vs ఆఫ్గానిస్తాన్ - ఢిల్లీ

అక్టోబర్ 12 - పాకిస్తాన్ Vs క్వాలిఫయర్ 2 - హైదరాబాద్

అక్టోబర్ 13 - ఆస్ట్రేలియా Vs సౌతాఫ్రికా - లక్నో

అక్టోబర్ 14 - ఇంగ్లాండ్ Vs ఆఫ్గానిస్తాన్ - ఢిల్లీ

అక్టోబర్ 14 - న్యూజీలాండ్ Vs బంగ్లాదేశ్ - చెన్నై

అక్టోబర్ 15 - ఇండియా Vs పాకిస్తాన్ - అహ్మదాబాద్

అక్టోబర్ 16 - ఆస్ట్రేలియా Vs క్వాలిఫయర్ 2 - లక్నో

అక్టోబర్ 17 - సౌతాఫ్రికా Vs క్వాలిఫయర్ 1 - ధర్మశాల

అక్టోబర్ 18 - న్యూజీలాండ్ Vs ఆఫ్గానిస్తాన్ - చెన్నై

అక్టోబర్ 19 - ఇండియా Vs బంగ్లాదేశ్ - పూణే

అక్టోబర్ 20 - ఆస్ట్రేలియా Vs పాకిస్తాన్ - బెంగళూరు

అక్టోబర్ 21 - ఇంగ్లాండ్ Vs సౌతాఫ్రికా - ముంబై

అక్టోబర్ 21 - క్వాలిఫయర్ 1 Vs క్వాలిఫయర్ 2 - లక్నో

అక్టోబర్ 22 - ఇండియా Vs న్యూజీలాండ్ - ధర్మశాల

అక్టోబర్ 23 - పాకిస్తాన్ Vs ఆఫ్గానిస్తాన్ - చెన్నై

అక్టోబర్ 24 - సౌతాఫ్రికా Vs బంగ్లాదేశ్ - ముంబై

అక్టోబర్ 25 - ఆస్ట్రేలియా Vs క్వాలిఫయర్ 1 - ఢిల్లీ

అక్టోబర్ 26 - ఇంగ్లాండ్ Vs క్వాలిఫయర్ 2 - బెంగళూరు

అక్టోబర్ 27- పాకిస్తాన్ Vs సౌతాఫ్రికా - చెన్నై

అక్టోబర్ 28 - క్వాలిఫయర్ 1 Vs బంగ్లాదేశ్ - కోల్‌కతా

అక్టోబర్ 28 - ఆస్ట్రేలియా Vs న్యూజీలాండ్ - ధర్మశాల

అక్టోబర్ 29 - ఇండియా Vs ఇంగ్లాండ్ - లక్నో

అక్టోబర్ 30 - ఆఫ్గానిస్తాన్ Vs క్వాలిఫయర్ 2 - పూణే

అక్టోబర్ 31 - పాకిస్తాన్ Vs బంగ్లాదేశ్ - కోల్‌కతా

నవంబర్ 1 - న్యూజీలాండ్ Vs సౌతాఫ్రికా - పూణే

నవంబర్ 2 - ఇండియా Vs క్వాలిఫయర్ 2 - ముంబై

నవంబర్ 3 - క్వాలిఫయర్ 1 Vs ఆఫ్గానిస్తాన్ - లక్నో

నవంబర్ 4 - ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా - అహ్మదాబాద్

నవంబర్ 4 - న్యూజీలాండ్ Vs పాకిస్తాన్ - బెంగళూరు

నవంబర్ 5 - ఇండియా Vs సౌతాఫ్రికా - కోల్‌కతా

నవంబర్ 6 - బంగ్లాదేశ్ Vs క్వాలిఫయర్ 2 - ఢిల్లీ

నవంబర్ 7 - ఆస్ట్రేలియా Vs ఆఫ్గానిస్తాన్ - ముంబై

నవంబర్ 8 - ఇంగ్లాండ్ Vs క్వాలిఫయర్ 1 - పూణే

నవంబర్ 9 - న్యూజీలాండ్ Vs క్వాలిఫయర్ 2 - బెంగళూరు

నవంబర్ 10 - సౌతాప్రికా Vs ఆఫ్గానిస్తాన్ - అహ్మదాబాద్

నవంబర్ 11 - ఇండియా Vs క్వాలిఫయర్ 1 - బెంగళూరు

నవంబర్ 12 - ఇంగ్లాండ్ Vs పాకిస్తాన్ - కోల్‌కతా

నవంబర్ 12 - ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్ - పూణే

నవంబర్ 15 - మొదటి సెమీ ఫైనల్ - ముంబై

నవంబర్ 16 - రెండో సెమీ ఫైనల్ - కోల్‌కతా

నవంబర్ 19 - ఫైనల్ - అహ్మదాబాద్

First Published:  27 Jun 2023 8:09 AM GMT
Next Story