Telugu Global
Sports

అత్యంత వేగంగా ఐపీఎల్ లో 100 వికెట్ల రికార్డు!

పంజాబ్ కింగ్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ కిగిసో రబడ..ఐపీఎల్ బౌలర్లకే బౌలర్ గా నిలిచాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని చేరిన తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

అత్యంత వేగంగా ఐపీఎల్ లో 100 వికెట్ల రికార్డు!
X

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా వంద వికెట్లు పడగొట్టిన రికార్డును పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ కిగిసో రబడ దక్కించుకొన్నాడు. మొహాలీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన పోరులో ఈ ఘనత సాధించాడు....

పంజాబ్ కింగ్స్ మెరుపు ఫాస్ట్ బౌలర్ కిగిసో రబడ..ఐపీఎల్ బౌలర్లకే బౌలర్ గా నిలిచాడు. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని చేరిన తొలిబౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

మొహాలీలోని పంజాబ్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ముగిసిన 4వ రౌండ్ పోరులో పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బౌలర్ గా వికెట్ల వేటకు దిగిన రబడ..ఇన్నింగ్స్ 5వ ఓవర్లోనే గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను అవుట్ చేయడం ద్వారా 100 వికెట్ల రికార్డును కైవసం చేసుకొన్నాడు.

గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన రబడను మొహాలీ ఫ్రాంచైజీ 2022 సీజన్ వేలం లో 9 కోట్ల 25 లక్షల రూపాయల ధరకు సొంతం చేసుకొంది.

64 మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు...

2008 నుంచి గత 16 సీజన్లుగా జరుగుతున్న ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా, అతితక్కువ మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా కిగిసో రబడా చరిత్ర సృష్టించాడు.

రబడ అతితక్కువ ఇన్నింగ్స్ లో మాత్రమే కాదు..అతి తక్కువ బంతుల్లోనే వంద వికెట్ల రికార్డు సాధించాడు. రబడ 100 వికెట్లు పడగొట్టడానికి 1438 బంతులు వేయాల్సి వచ్చింది.

ముంబై ఇండియన్స్ మాజీ ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలిగ 70 మ్యాచ్ ల్లో 1622 బంతులు వేసి 100 వికెట్లు సాధిస్తే...ఆ తర్వాతి స్థానంలో చెన్నైసూపర్ కింగ్స్ సీమర్ డ్వయన్ బ్రావో నిలిచాడు.

బ్రావో 1619 బంతుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పేసర్ హర్షల్ పటేల్ 81 మ్యాచ్ లు, 1647 బాల్స్ లో 100 వికెట్లు పడగొట్టాడు.

హైదరాబాద్ సన్ రైజర్స్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 82 మ్యాచ్ ల్లోనూ, గుజరాత్ టైటాన్స్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 83, అశీష్ నెహ్రా 83 మ్యాచ్ ల్లోనూ 100 వికెట్ల రికార్డులు అందుకోగలిగారు.

అయితే..వీరందరినీ అధిగమించడం ద్వారా రబడ 64 మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు సాధించగలిగాడు.

అత్యంత వేగంగా 100 వికెట్లు మైలురాయి చేరిన మొదటి ఐదుగురు బౌలర్లలో రషీద్ ఖాన్ రూపంలో కేవలం ఒకే ఒక్క స్పిన్నర్ ఉన్నాడు. మగిలిన బౌలర్లంతా ఫాస్ట్, ఫాస్ట్ మీడియం బౌలర్లు కావడం విశేషం.

First Published:  14 April 2023 9:07 AM GMT
Next Story