Telugu Global
Sports

ఢిల్లీ టెస్టులోనూ అదేసీన్, భారత్ 6 వికెట్ల విజయం!

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాపై రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సిరీస్ లో 2-0 తో పైచేయి సాధించింది.

ఢిల్లీ టెస్టులోనూ అదేసీన్, భారత్ 6 వికెట్ల విజయం!
X

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాపై రెండోర్యాంకర్ భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. సిరీస్ లో 2-0 తో పైచేయి సాధించింది.

ప్రపంచ టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాకు భారత గడ్డపై ప్రస్తుత 2023 టెస్టు సిరీస్ లో వరుసగా రెండో ఓటమి తప్పలేదు. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు మూడోరోజు ఆటలోనే భారత్ 6 వికెట్ల విజయంతో టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరువయ్యింది.

స్పిన్నర్ల షో..పూజారా విన్నింగ్ రన్..

అంతకుముందు..ఆస్ట్ర్రేలియాను భారత స్పిన్ జోడీ అశ్విన్ - జడేజా 113 పరుగులకే కుప్పకూల్చారు. జడేజా 7 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. 115 పరుగుల విజయ లక్ష్యంతో చేజింగ్ కు దిగిన భారత్ 4 వికెట్ల నష్టానికి విజేతగా నిలువగలిగింది.

తన కెరియర్ లో వందో టెస్టు ఆడుతూ తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన నయావాల్ పూజారా 27, వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ 23 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

సిరీస్ లోని మూడోటెస్టు ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ విజయంతో భారత్..ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్స్ కు చేరుకోగలిగింది.

First Published:  19 Feb 2023 2:15 PM IST
Next Story