Telugu Global
Sports

ఇరానీకప్ విజేత రెస్టాఫ్ ఇండియా

రంజీ చాంపియన్ సౌరాష్ట్ర్రతో జరిగిన ఇరానీకప్ పోరులో హనుమ విహారీ నాయకత్వంలోని రెస్టాఫ్ ఇండియాజట్టు విజేతగా నిలిచింది. ఐదురోజుల ఈ సమరం చివరి రోజు ఆట మిగిలి ఉండగానే రెస్ట్ జట్టు 8 వికెట్ల విజయం సాధించింది.

ఇరానీకప్ విజేత రెస్టాఫ్ ఇండియా
X

రంజీ చాంపియన్ సౌరాష్ట్ర్రతో జరిగిన ఇరానీకప్ పోరులో హనుమ విహారీ నాయకత్వంలోని రెస్టాఫ్ ఇండియాజట్టు విజేతగా నిలిచింది. ఐదురోజుల ఈ సమరం చివరి రోజు ఆట మిగిలి ఉండగానే రెస్ట్ జట్టు 8 వికెట్ల విజయం సాధించింది....

మూడేళ్ల విరామం తర్వాత బీసీసీఐ నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇరానీకప్ టోర్నీలో రెస్టాఫ్ ఇండియాజట్టే విజేతగా నిలిచింది. రాజ్ కోట లోని సారాష్ట్ర్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐదురోజుల ఈ పోటీలో రంజీ విజేత సౌరాష్ట్ర్రతో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి నాయకత్వంలోని రెస్టాఫ్ ఇండియాజట్టు తలపడింది.

ఆల్ రౌండర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వంలోని సౌరాష్ట్ర్రజట్టులో చతేశ్వర్ పూజారా, షెల్డన్ జాక్సన్ లాంటి పలువురు మేటి ఆటగాళ్లున్నా...హనుమ విహారీ కెప్టెన్సీలోని రెస్టాఫ్ ఇండియాజట్టుకు సరిజోడీ కాలేకపోయింది.

సౌరాష్ట్ర్ర ను ఆదుకోని స్థానబలం...

జాతీయ క్రికెట్ విజేతలకు ఇచ్చే రంజీట్రోఫీ విన్నర్ సౌరాష్ట్ర్ర జట్టు స్థానబలాన్ని ఆయుధంగా చేసుకోడంలో విఫలమయ్యింది. సొంతం గ్రౌండ్లో మ్యాచ్ జరిగినా హోం ఎండ్వాటేజ్ ను సద్వినియోగం చేసుకోలేకపోయింది.

రోజుకు 90 ఓవర్ల చొప్పున ..ఐదురోజులపాటు రెండు ఇన్నింగ్స్ గా సాగే ఈ పోరు తొలిరోజు ఆటలోనే సౌరాష్ట్ర్రజట్టు పేకమేడలా 98 పరుగులకే కుప్పకూలిపోయింది.

రెస్ట్ జట్టుకు ఆడుతున్న బెంగాల్ ఫాస్ట్ బౌలర్ మనోజ్ కుమార్ తొలిరోజు ఆటలో విశ్వరూపమే ప్రదర్శించాడు. సౌరాష్ట్ర్ర టాపార్డర్ లోని మొదటి నలుగురు ఆటగాళ్లను మనోజ్ పెవీలియన్ దారి పట్టించాడు.

తొలి అన్నింగ్స్ లో ప్రత్యర్థిని 98 పరుగులకే కుప్పకూల్చిన రెస్టాఫ్ ఇండియాకు తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ హనుమ విహారీ- సర్ ఫ్రాజ్ ఖాన్ కీలక భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు. 18 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లు నష్టపోయిన రెస్టాఫ్ ఇండియాను విహారీ- సర్ ఫ్రాజ్ జోడీ..తమ ఫైటింగ్ భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

నాలుగో వికెట్ కు ఏకంగా 220 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. కెప్టెన్ విహారీ 184 బాల్స్ లో 82 పరుగుల స్కోరుకు అవుట్ కాగా...సర్ ఫ్రాజ్ స్ట్ర్రోక్ ఫుల్ సెంచరీ సాధించాడు. దీంతో రెస్ట్ జట్టు తొలిఇన్నింగ్స్ లో 374 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.

నిప్పులు చెరిగిన కుల్దీప్, ఉమ్రాన్...

తొలి ఇన్నింగ్స్ లో 98 పరుగులకే ఆలౌటైన సౌరాష్ట్ర్ర రెండో ఇన్నింగ్స్ లో భారీస్కోరు కోసం గొప్పపోరాటమే చేసింది. కెప్టెన్ ఉనద్కత్ 89 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సౌరాష్ట్ర్ర రెండో ఇన్నింగ్స్ లో 380 పరుగులకు ఆలౌటయ్యింది. రెస్టాఫ్ ఇండియా యువఫాస్ట్ బౌలర్ల జోడీ కుల్దీప్ సేన్ 5 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ 94 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు.

మ్యాచ్ నెగ్గాలంటే చివరి రెండురోజుల ఆటలో 105 పరుగులు మాత్రమే చేయాల్సిన రెస్టాఫ్ ఇండియా...కేవలం 2 వికెట్ల నష్టానికే విజయం సొంతం చేసుకోగలిగింది.

ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 63, రెండోడౌన్ భరత్ 27 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో 2 వికెట్లకు 105 పరుగులతో విజయలక్ష్యాన్ని చేరుకొంది.

రెస్టాఫ్ ఇండియా విజయంలో ప్రధానపాత్ర వహించిన స్వింగ్ బౌలర్ మనోజ్ కుమార్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రెండు ఇన్నింగ్స్ లో కలసి 8 వికెట్లు పడగొట్టిన యువఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ కు నెట్ బౌలర్ గా భారతజట్టుతో కలసి ఆస్ట్రేలియాకు ప్రయాణమయ్యే అవకాశం దక్కింది.

First Published:  5 Oct 2022 3:00 PM IST
Next Story