మూడేళ్ల తర్వాత...నేటినుంచే ఇరానీకప్
రెస్టాఫ్ ఇండియా- రంజీట్రోఫీ విజేత జట్ల మధ్య జరిగే ఇరానీకప్ సమరం మూడేళ్ల విరామం తర్వాత...రాజ్ కోట స్టేడియం వేదికగా ఈ రోజు నుంచి ఐదురోజులపాటు జరుగనుంది.
రెస్టాఫ్ ఇండియా- రంజీట్రోఫీ విజేత జట్ల మధ్య జరిగే ఇరానీకప్ సమరం మూడేళ్ల విరామం తర్వాత...రాజ్ కోట స్టేడియం వేదికగా ఈ రోజు నుంచి ఐదురోజులపాటు జరుగనుంది. రెస్టాఫ్ ఇండియాజట్టుకు తెలుగుతేజం హనుమ విహారీ నాయకత్వం వహిస్తున్నాడు...
కరోనాతో సహా పలు కారణాలతో గత మూడేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఇరానీకప్ ట్రోఫీ క్రికెట్ సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమయ్యింది. టెస్ట్ ఫార్మాట్లో ఐదురోజులపాటు జరిగే ఈ పోటీలో దేశవాళీ క్రికెట్ రంజీట్రోఫీ విజేత జట్టుతో ...రెస్టాఫ్ ఇండియాజట్టు తలపడుతూ రావడం ఆనవాయితీగా వస్తోంది.
2019-20 తర్వాత....
ఇరానీకప్ మ్యాచ్ ను బీసీసీఐ చివరిసారిగా 2019-20 సీజన్లో నిర్వహించింది. ఆ తర్వాత నుంచి కోవిడ్ దెబ్బతో టోర్నీ వాయిదా పడుతూ వచ్చింది. 2018-19 సీజన్ ఇరానీకప్ ను విదర్భజట్టు గెలుచుకొంది. ఆ తర్వాత తిరిగి మూడేళ్ల విరామానికి 2021-22 పోరు.. రాజ్ కోట లోని సౌరాష్ట్ర్ర్ క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా అక్టోబర్ 1 నుంచి 5 వరకూ జరుగనుంది.
రంజీట్రోఫీ విజేత సౌరాష్ట్ర్ర జట్టుతో హనుమ విహారీ నాయకత్వంలోని రెస్టాఫ్ ఇండియాజట్టు అమీతుమీ తేల్చుకోనుంది. బీసీసీఐ ప్రకటించిన రెస్టాఫ్ ఇండియాజట్టులో యువఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, వెటరన్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, యువఆటగాడు యశ్ దుల్, ప్రియాంక్ పంచోల్, అభిమన్యు ఈశ్వరన్, సర్ ఫ్రాజ్ ఖాన్, యశస్వి జైశ్వాల్, కెఎస్ భరత్ ఉన్నారు. జయంత్ యాదవ్,సౌరభ్ కుమార్,సాయి కిశోర్ స్పిన్ బాధ్యతను నిర్వర్తించనున్నారు. కుల్దీప్ సేన్, అర్జాన్ రంజీ విజేత సౌరాష్ట్ర్ర జట్టుకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జయదేవ్ ఉనద్కత్ నాయకత్వం వహిస్తున్నాడు.
రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదురోజులపాటు నాలుగు ఇన్నింగ్స్ గా ఈ పోటీని నిర్వహిస్తారు.దేశవాళీ క్రికెట్లో ప్రతిభావంతులైన యువక్రికెటర్ల సత్తాకు ఇరానీట్రోఫీ మ్యాచ్ పరీక్షకానుంది.