టెండుల్కర్ కొడుకును ఎవరూ కొనలే
అర్జున్ ను కొనేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
BY Naveen Kamera25 Nov 2024 9:48 PM IST

X
Naveen Kamera Updated On: 25 Nov 2024 9:48 PM IST
భారత క్రికెట్‌లో ఠక్కున చెప్పే లెజెండ్ క్రికెటర్లలో సచిన్ టెండల్కర్ ముందు వరుసలో ఉంటారు. అలాంటి సచిన్ టెండుల్కర్ కొడుకును ఐపీఎల్ మెగా వేలంలో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో ఉన్న అన్ క్యాప్డ్ ప్లేయర్ అర్జున్ టెండుల్కర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్.. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్. ఇన్నాళ్లు ముంబయి ఇండియన్స్ టీమ్ లో కొనసాగిన అర్జున్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. ముంబయి ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ లో సచిన్ టెండుల్కర్ భాగస్వామిగా ఉండి కూడా కొడుకును రిటైన్ చేయించలేకపోయాడు. ఇప్పుడు మెగా వేలంలో పాల్గొంటే ఆయనను కొనేందుకు ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. డొమెస్టిక్ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ అర్జున్ భారీ ప్రదర్శన కనబరచలేదు. అందుకే ఫ్రాంచైజీలు అర్జున్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
Next Story