IPL 2023: ఐపీఎల్ ఆరంభ పోరులో చెన్నైపై గుజరాత్ విక్టరీ
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63), 37 రన్స్ వద్ద వృద్దిమాన్ సాహా(25) తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించాడు.
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్ ఉత్కంఠ పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.చెన్నై సూపర్ కింగ్స్ విధించిన 179 టార్గెట్‌ను 19.2 ఓవర్లలో ఛేదించింది.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (63), 37 రన్స్ వద్ద వృద్దిమాన్ సాహా(25) తర్వాత వచ్చిన సాయి సుదర్శన్(22) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 50 రన్స్ జోడించాడు. హార్దిక్ పాండ్యా(8)ను జడేజా బౌల్డ్ చేయడంతో 113 రన్స్ వద్ద మూడో వికెట్ పడింది. గిల్ ఔటయ్యాక.. విజయ్ శంకర్, తెవాటియా అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. సీఎస్కే బౌలర్లలో హంగర్గేకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తుషార్ దేశ్‌పాండే , జడేజా తలా ఒక వికెట్ తీశారు. మూడు ఓవర్లలో 30 రన్స్ కావాల్సిన దశలో.. హంగర్గేకర్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ సిక్స్ కొట్టాడు. అతను ఔటయ్యాక రషీద్ 19 వ ఓవర్‌లో సిక్స్, ఫోర్ కొట్టి గుజరాత్ ను గెలిపించాడు
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 178 రన్స్ కొట్టింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92) హాఫె సెంచరీతో చెలరేగాడు. మోయిన్ అలీ(23), శివం దూబే(19), అంబటి రాయుడు(12) విఫలమయ్యారు. ఆఖర్లో కెప్టెన్ ధోనీ (14) బ్యాట్ ఝులిపించడంతో సీఎస్కే 178 రన్స్ చేయగలిగింది. రుతురాజ్ గైక్వాడ్ సిక్స్‌లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి జోరు చూస్తుంటే ఈ సీజన్‌లో తొలి సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ, అల్జారీ జోసెఫ్ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 92 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు.