Telugu Global
Sports

రోహిత్ బ్యాటింగ్ వైఫ‌ల్యానికి గాయ‌మే కార‌ణ‌మా?

35 ఏళ్ల రోహిత్ శ‌ర్మ ఈ టీ 20 ప్ర‌పంచ్ క‌ప్ టోర్నీలో ఇప్పటివరకు ఒక అర్ధ సెంచరీ కొట్టాడు. సెమీఫైనల్ పోరు గురువారం(నవంబర్ 10) అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా రోహిత్ రాణిస్తార‌నే ఆశ‌తో భార‌త్ జ‌ట్టుతోపాటు, ఆయ‌న అభిమానులు ఉన్నారు.

రోహిత్ బ్యాటింగ్ వైఫ‌ల్యానికి గాయ‌మే కార‌ణ‌మా?
X

టీ 20 ప్ర‌పంచ్ క‌ప్‌లో భార‌త్ జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ తీరుతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్ర‌తి మ్యాచ్‌లోనూ రోహిత్ శ‌ర్మ ఓపెన‌ర్‌గా వ‌స్తున్నా....ప‌వ‌ర్ ప్లే ఓవ‌ర్స్ వ‌ర‌కూ కూడా బ్యాటింగ్ నిల‌క‌డ‌గా ఆడ‌లేక ఔట్ అవుతున్న తీరు... జ‌ట్టుకే కాదు, అభిమానుల‌నూ ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. మొన్న‌ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌కు ముందు రోహిత్ శర్మ కుడి ముంజేయికి దెబ్బ తగలడంతో అది పూర్తిగా న‌యం కాకుండానే ఆయ‌న జ‌ట్టు కోసం ఆడుతున్న‌ట్లు చెబుతున్నారు.

ప్రాక్టీస్‌లో భాగంగా త్రో డౌన్ బాల్స్‌ను ఎదుర్కొంటున్నప్పుడు ఒక బంతి లెంగ్త్ నుండి పైకి లేచి రోహిత్ శ‌ర్మ‌ ముంజేయికి తాకింది. నొప్పితో ఆయ‌న తీవ్రంగా బాధ‌ప‌డ్డారు. డాక్ట‌ర్ వ‌చ్చి మెడిసిన్ ఇచ్చిన కొద్దిసేప‌టికి రోహిత్ మళ్లీ స్ట్రైక్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఒక బాల్ ఆడాక‌ నొప్పితో నెట్ సెషన్‌ను రద్దు చేసుకున్నాడు. ఈ ప‌రిస్థితుల్లో రోహిత్ శ‌ర్మ టీ 20 మ్యాచుల్లో స‌రిగా బ్యాటింగ్ చేయ‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. 35 ఏళ్ల రోహిత్ శ‌ర్మ ఈ టీ 20 ప్ర‌పంచ్ క‌ప్ టోర్నీలో ఇప్పటివరకు ఒక అర్ధ సెంచరీ కొట్టాడు. సెమీఫైనల్ పోరు గురువారం(నవంబర్ 10) అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా రోహిత్ రాణిస్తార‌నే ఆశ‌తో భార‌త్ జ‌ట్టుతోపాటు, ఆయ‌న అభిమానులు ఉన్నారు.

రోహిత్, KL రాహుల్ ప్రపంచకప్ ట్ర‌య‌ల్ మ్యాచ్‌ల్లోనూ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లుగా ట్రెండ్ సెట్‌చేశారు. ఈ టీ20 మ్యాచుల్లో వారి మధ్య చెప్పుకోగ‌దగ్గ పార్ట‌న‌ర్షిప్ ప‌రుగులు ఏమీ లేవ‌నే చెప్పాలి. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో సైతం 27 ప‌రుగుల పార్ట‌న‌ర్‌షిప్‌తో క్లోజ్ చేశారు. అదే అత్యుత్తమ భాగస్వామ్యంగా ఉంది.

దీంతో టోర్నమెంట్ ప్రారంభంలో భారత్ డబుల్ ఆపదను ఎదుర్కొంది, రాహుల్ కూడా ప‌రుగులు సాధించ‌డంలో విఫలమయ్యాడు, అయితే బంగ్లాదేశ్, జింబాబ్వేపై వరుసగా అర్ధ సెంచరీల తర్వాత రాహుల్ బ్యాటింగ్‌పై మ‌ళ్లీ ఆశ‌లు చిగురించాయి.

First Published:  8 Nov 2022 12:48 PM IST
Next Story