Telugu Global
Sports

మూడో టీ 20 లో ఇండియా గ్రాండ్‌ విక్టరీ

సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసిన భారత్‌

మూడో టీ 20 లో ఇండియా గ్రాండ్‌ విక్టరీ
X

బంగ్లాదేశ్ తో ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన టీ 20 మూడో మ్యాచ్‌ లో ఇండియా టీమ్‌ 133 పరుగుల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ 40 బంతుల్లోనే సెంచరీ చేయగా, కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ దనాదన్‌ ఫిఫ్టీ.. వారికి కొనసాగింపుగా హార్థిక్‌ పాండ్యా, రియాన్‌ పరాగ్‌ సూపర్‌ నాక్‌ తో టీమిండియా రికార్డు స్కోర్‌ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ టీమ్‌ ఇన్నింగ్స్‌ ఫస్ట్‌ బాల్‌ కే వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు ఒత్తిడికి లోనై భారీ ఎత్తున పరుగుల ఇవ్వగా, టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేశారు. దీంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాట్స్‌ మెన్‌ లలో తౌహిద్‌ హృదయ్‌ 42 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగుల చేయగా, వికెట్‌ కీపర్‌ లిటన్‌ దాస్‌ 25 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 42 పరుగులు చేశారు. వీరిద్దరు మినహా బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో మిగతా వాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. తంజీద్‌ హసన్‌ 15, కెప్టెన్‌ శాంటో 14, తంజీబ్‌ హసన్‌ షకీబ్‌ 8, మహ్మదుల్లా 8, మెహదీ హసన్‌ 3 పరుగులు చేయగా , ఎక్స్‌ ట్రాస్ రూపంలో 11 పరగులు వచ్చాయి. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ నాలుగు ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. మయాంక్‌ యాదవ్‌ నాలుగు ఓవర్లలో 32 రన్స్‌ ఇచ్చి రెండు వికెట్లు దక్కించుకున్నాడు వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి తలా ఒక వికెట్‌ పడగొట్టారు. వరుణ్‌ చక్రవర్తి బెస్ట్‌ బౌలింగ్‌ పర్ఫార్మెన్స్‌ తో ఆకట్టుకున్న వికెట్‌ దక్కించుకోలేకపోయారు. మూడో మ్యాచ్‌ లో గ్రాండ్‌ విక్టరీతో మూడు టీ 20ల సిరీస్‌ ను టీమిండియా క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇండియా టూర్‌ లో బంగ్లాదేశ్‌ చెప్పుకోదగ్గ ప్రభావం చూపించలేకపోయింది. రెండు టెస్ట్‌ మ్యాచ్‌ ల సిరీస్‌ ను 2-0 తేడాతో కోల్పోయిన బంగ్లాదేశ్‌ కు టీ 20ల్లోనూ వైట్‌ వాష్‌ తప్పలేదు.

First Published:  12 Oct 2024 10:53 PM IST
Next Story