Telugu Global
Sports

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలిస్వర్ణం.. ఎయిర్ రైఫిల్‌లో వరల్డ్‌ రికార్డు

రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన టీమ్‌ ఫైనల్‌లో 1893.7 పాయింట్లు నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డు క‌నుమ‌రుగైంది.

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలిస్వర్ణం.. ఎయిర్ రైఫిల్‌లో వరల్డ్‌ రికార్డు
X

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ విభాగంలో టీమ్ ఇండియా గోల్డ్‌మెడల్ సాధించింది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో ఇదే తొలి స్వర్ణం. ఈ క్రమంలో గతంలో చైనా నమోదు చేసిన వరల్డ్‌ రికార్డును చెరిపేసింది టీమ్‌ ఇండియా. రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన టీమ్‌ ఫైనల్‌లో 1893.7 పాయింట్లు నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డు క‌నుమ‌రుగైంది.

ఇక పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్ విభాగంలో జట్టుగా గోల్డ్‌ మెడల్ సాధించిన రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకున్నారు. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ థర్డ్ ప్లేస్, తోమర్ ఐదో స్థానం, దివ్యాన్ష్‌ 8వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు.

ఇప్పటివరకూ ఇండియా ఖాతాలో ఓ గోల్డ్‌మెడల్‌తో పాటు 3 సిల్వర్‌, 5 కాంస్య పతకాలున్నాయి. ఇక పతకాల పట్టికలో 27 స్వర్ణాలు, 11 రజతం, 5 కాంస్య పతకాలతో చైనా టాప్‌ ప్లేసులో కొన‌సాగుతోంది.

First Published:  25 Sept 2023 10:21 AM IST
Next Story