Telugu Global
Sports

భారత క్రికెటర్ల దీపావళి వేడుకలు!

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ కు ముందే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు బెంగళూరులో ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకొన్నారు....

భారత క్రికెటర్ల దీపావళి వేడుకలు!
X

ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి రౌండ్ మ్యాచ్ కు ముందే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు బెంగళూరులో ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకొన్నారు....

ఐసీసీ వన్డే ప్రపంచకప్ ను మూడోసారి గెలుచుకోవాలన్న పట్టుదలతో ఆడుతున్న రోహిత్ శర్మ నాయకత్వంలోని 15మంది సభ్యుల భారతజట్టు గత నెలరోజులుగా విజయాలతో పాటు ప్రతిక్షణాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తోంది.

బెంగళూరులో ..సాంప్రదాయ దుస్తుల్లో...!

భారత్ లోని పది నగరాలు వేదికలుగా గత ఐదువారాలుగా జరుగుతున్న 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భారత్ తిరుగులేని విజయాలతో సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.

మొత్తం 10 జట్ల రౌండ్ రాబిన్ లీగ్ లో మొదటి ఎనిమిది రౌండ్లలోనూ 8 విజయాలు సాధించడం ద్వారా 16 పాయింట్లతో లీగ్ టేబుల్ టాపర్ గా నిలిచిన భారతజట్టు

దీపావళిరోజునే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా తన ఆఖరి రౌండ్ మ్యాచ్ ఆడనుంది.

రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా, రోహిత్ శర్మ జట్టుని ముందుండి నడిపించే నాయకుడిగా భారతజట్టు ప్రత్యర్థిజట్లను చిత్తు చేస్తూ అత్యంత విజయవంతమైన జట్టుగా

గుర్తింపు తెచ్చుకొంది.

6 రోజుల విరామం తరువాత...

గత నెలరోజుల కాలంలో ప్రపంచకప్ మ్యాచ్ ల కోసం ఇప్పటికే వేలకిలోమీటర్ల ప్రయాణం చేసి..చెన్నై, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, ధర్మశాల, పూణే, ముంబై, కోల్ కతా, లక్నో నగరాలను చుట్టి వచ్చి..ఆఖరి రౌండ్ మ్యాచ్ కోసం బెంగళూరు చేరుకొన్న భారతజట్టు సభ్యులకు గత ఆరురోజులుగా విరామం దొరికింది.

బెంగళూరులో విడిది చేసి..చిన్నస్వామి స్టేడియంలో సాధన చేస్తున్న భారతజట్టు సభ్యులు..ఆఖరి రౌండ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ ను చిత్తు చేయటానికి సిద్ధమయ్యారు.

ఆఖరి రౌండ్ మ్యాచ్ ఆడటానికి ముందే రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో దీపావళిని వేడుకగా జరుపుకొన్నారు.

మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలతో సహా జట్టులోని సభ్యులంతా రంగురంగుల కుర్తా-పైజమా ధరించి మరీ వేడుకల్లో పాల్గొన్నారు.

ఇప్పటి వరకూ టీమిండియా జెర్సీలలో మెరిసిన భారత క్రికెటర్లు ఒక్కసారిగా సాంప్రదాయ దుస్తులతో పండుగ చేసుకొన్నారు. తమ వేడుకల ఫోటోను వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకొన్నాడు.

వరుసగా 9వ విజయం కోసం...

దీపాల పండుగ దీపావళిని తాము జట్టుగా జరుపుకొన్నామని, వరుసగా 9వ విజయంతో ప్రపంచ రికార్డుకు సిద్ధమయ్యామని రాహుల్ వివరించాడు. అత్యధిక పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్స్ చేరిన భారతజట్టు +2.456. నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది.

ఆస్ట్ర్రేలియా, అప్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాజట్లను చిత్తు చేసిన భారత్ తన ఆఖరి రౌండ్లో పసికూన నేదర్లాండ్స్ తో

ఈరోజు తలపడనుంది.

నెదర్లాండ్స్ తో జరిగే పోరులో విరాట్ కొహ్లీ 50వ వన్డే శతకంతోనూ, భారతజట్టు వరుసగా 9 వ విజయంతోనూ జంట ప్రపంచ రికార్డులు నెలకొల్పాలని అభిమానులు కోరుకొంటున్నారు.

First Published:  12 Nov 2023 10:48 AM IST
Next Story