Telugu Global
Sports

జూనియర్ హాకీలో భారత కుర్రాళ్లజోరు!

మలేసియా వేదికగా జరుగుతున్నసుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీలో భారత కుర్రాళ్లు జోరు మీదున్నారు. పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన పోరులో 5-5 గోల్స్ తో సమఉజ్జీలుగా నిలిచారు....

జూనియర్ హాకీలో భారత కుర్రాళ్లజోరు!
X

మలేసియా వేదికగా జరుగుతున్నసుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీలో భారత కుర్రాళ్లు జోరు మీదున్నారు. పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన పోరులో 5-5 గోల్స్ తో సమఉజ్జీలుగా నిలిచారు....

అంతర్జాతీయ హాకీలో భారత సీనియర్ జట్టు మాత్రమే కాదు...కుర్రాళ్లజట్టు సైతం నిలకడగా రాణిస్తూ సత్తా చాటుకొంటోంది. మలేసియాలోని జోహార్ బాహ్రూ వేదికగా

జరుగుతున్న 2022 సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ జూనియర్ అంతర్జాతీయ హాకీ టోర్నీలో ప్రపంచ మేటిజట్లన్నీ తలపడుతున్నాయి.

ఆతిథ్య మలేసియా, ఆస్ట్ర్రేలియా, మలేసియా, దక్షిణాఫ్రికా, జపాన్, గ్రేట్ బ్రిటన్ లాంటి మేటిజట్లు బరిలో నిలిచాయి. రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగు రౌండ్ల పోటీలు ముగిసే సమయానికి లీగ్ టేబుల్ రెండోస్థానంలో భారత్ కొనసాగుతోంది.

ఆస్ట్ర్రేలియాను నిలువరించిన భారత్..

రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత పోరును భారత కుర్రాళ్లు ఆఖరి నిముషం గోలుతో 5-5తో డ్రాగా ముగించగలిగారు.

మెరుపువేగంతో నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ సమరంలో భారత్ తరపున ఆట 60వ నిముషంలో అమన్ దీప్ సింగ్ సాధించిన గోలుతో 5-5తో సమఉజ్జీగా నిలువగలిగింది.

ఆట మొదటి భాగానికి రెండుజట్లు చెరో 3 గోల్స్ సాధించి 3-3తో సమఉజ్జీలుగా నిలిచాయి. ఆ తర్వాత స్కోరు 4-4కు చేరింది. ఆ వెంటనే ఆస్ట్ర్రేలియా మరోగోలు చేయడంతో

స్కోరు 5-4 కావడంతో భారత్ ఓటమి ఖాయమని భావించారు. అయితే..ఆట ఆఖరినిముషంలో అమన్ దీప్ అద్భుతమే చేశాడు.

భారత్ తరపున బాబీసింగ్ ధామీ ఒకగోలు, శరద్ నంద తివారీ 2 గోల్సు, అర్జిత్ సింగ్ హుండాయ్ ఒక గోలు సాధించారు.

అంతకు ముందు జరిగిన పోటీలలో ఆతిథ్య మలేసియాను 5-2 గోల్స్ తో చిత్తు చేసిన భారత్ రెండోరౌండ్లో దక్షిణాఫ్రికా చేతిలో 4-5 గోల్స్ తో పరాజయం చవిచూడక తప్పలేదు. ఆ తర్వాతి రౌండ్లో జపాన్ ను 5-1 గోల్స్ తో ఓడించిన భారత్ ఆఖరి రౌండ్లో గ్రేట్ బ్రిటన్ తో తలపడాల్సి ఉంది.

రౌండ్ రాబిన్ లీగ్ మొదటి నాలుగురౌండ్ల మ్యాచ్ లు ముగిసే సమయానికి 10 పాయింట్లతో ఆస్ట్ర్రేలియా, 8 పాయింట్లతో భారత్ మొదటి రెండుస్థానాలలో కొనసాగుతున్నాయి.

First Published:  27 Oct 2022 8:30 AM IST
Next Story