Telugu Global
Sports

దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

నాలుగు టీ20ల సిరీస్‌ 3-1తో కైవసం

దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం
X

దక్షిణాఫ్రికా పై నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 135 రన్స్‌ తేడాతో సఫారీలపై విజయం సాధించింది. నాలుగు టీ 20 మ్యాచ్‌ ల సిరీస్‌ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. జొహనెస్‌బర్గ్‌ లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌ లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 283 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ అద్భుత సెంచరీలతో కొత్త రికార్డులు నెలకొల్పారు. 284 పరుగుల భారీ టార్గెట్‌ చేదించేందుకు బ్యాటింగ్‌ కు సఫారీ టీమ్‌ మొదట్లోనే తడబడింది. పది పరుగులకే మొదటి నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌ కాసేపు మెరుపులు మెరిపించినా టార్గెట్‌ భారీ గా ఉండటంతో రన్స్‌ కొట్టే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు. దక్షిణాఫ్రికా టీమ్‌ లో స్టబ్స్‌ 43, డేవిడ్‌ మిల్లర్‌ 36, జాన్సన్‌ 29 పరుగులు చేశారు. 18.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా 148 పరుగులు చేసి ఆల్‌ ఔట్‌ అయ్యింది. భారత బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ మూడు, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్లు. హార్థిక్‌ పాండ్యా, రమణ్‌ దీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

First Published:  16 Nov 2024 12:42 AM IST
Next Story