Telugu Global
Sports

ఆసియాకప్ ఫైనల్లో భారత్!

ఆసియాకప్ మహిళల టీ-20 క్రికెట్ ఫైనల్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు చేరుకొంది. సిల్హౌట్ లో కొద్ది సేపటి క్రితం ముగిసిన తొలిసెమీఫైనల్లో పసికూన థాయ్ లాండ్ పై భారత్ భారీవిజయంతో టైటిల్ రౌండ్ కు చేరుకొంది.

ఆసియాకప్ ఫైనల్లో భారత్!
X

ఆసియాకప్ మహిళల టీ-20 క్రికెట్ ఫైనల్స్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు చేరుకొంది. సిల్హౌట్ లో కొద్ది సేపటి క్రితం ముగిసిన తొలిసెమీఫైనల్లో పసికూన థాయ్ లాండ్ పై భారత్ భారీవిజయంతో టైటిల్ రౌండ్ కు చేరుకొంది.

మహిళల ఆసియాకప్ టీ-20 టైటిల్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ గెలుపు దూరంలో నిలిచింది. బంగ్లాదేశ్ లోని సిల్హౌట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా గత రెండువారాలుగా జరుగుతున్న ఈటోర్నీ రౌండ్ రాబిన్ లీగ్ లో టాపర్ గా నిలిచిన భారత్...తొలిసెమీఫైనల్ నాకౌట్ రౌండ్లోనూ సత్తా చాటుకొంది.

సెమీస్ లో థాయ్ చిత్తు చిత్తు...

ఫైనల్లో చోటు కోసం జరిగిన తొలిసెమీఫైనల్లో భారతజట్టు 74 పరుగుల తేడాతో థాయ్ లాండ్ ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు సాధించింది.

భారత బ్యాటర్లలో ఓపెనర్లు షెఫాలీ వర్మ 42, స్మృతి మందన 13, జెమీమా రోడ్రిగేజ్ 27, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 36, ఆల్ రౌండర్ పూజా వస్త్ర్రకర్ 17 పరుగులు సాధించారు.

సమాధానంగా 149 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన థాయ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత స్పిన్ జోడీ దీప్తి, రాజేశ్వరిలను థాయ్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయారు.

భారత బౌలర్లు దీప్తి శర్మ 3 వికెట్లు, రాజేశ్వరీ గయక్వాడ్ 2 వికెట్లు, రేణుకా సింగ్, షెఫాలీవర్మ, స్నేహ రాణా తలో వికెట్ పడగొట్టారు.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్ షెఫాలీవర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

శ్రీలంక- పాకిస్థాన్ జట్ల రెండో సెమీఫైనల్లో నెగ్గిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.

First Published:  13 Oct 2022 11:53 AM IST
Next Story