Telugu Global
Sports

న్యూజిలాండ్ లో నేటినుంచే భారత్ టీ-20 సిరీస్

భారతజట్టుకు టీ-20 సిరీస్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. వన్డే జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నారు.సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానుంది.

న్యూజిలాండ్ లో నేటినుంచే భారత్ టీ-20 సిరీస్
X

న్యూజిలాండ్ లో నేటినుంచే భారత్ టీ-20 సిరీస్

న్యూజిలాండ్ తో తీన్మార్ టీ-20 , వన్డే సిరీస్ ల్లో తలపడటానికి భారతజట్టు వారం క్రితమే కివీల్యాండ్ కు చేరుకొంది. భారతజట్టుకు టీ-20 సిరీస్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా. వన్డే జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నారు.సిరీస్ లోని తొలి టీ-20 మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానుంది.

ఆస్ట్ర్రేలియా వేదికగా టీ-20 ప్రపంచకప్ ముగిసిందో లేదో..మరో విదేశీ సిరీస్ కు భారతజట్టు సిద్ధమయ్యింది. న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ కోసం కివీల్యాండ్ కు చేరుకొంది.

సీనియర్లకు రెస్ట్..కుర్రాళ్లకు చాన్స్...

ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ లో పాల్గొన్న తమ స్టార్ క్రికెటర్లలో కొందరికి ఇటు భారత్, అటు న్యూజిలాండ్ విశ్రాంతి నిచ్చి..ఎక్కువమంది యువఆటగాళ్లతో సిరీస్ సమరానికి సై అంటున్నాయి.

మూడుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లో పాల్గొనే భారతజట్టుకు హార్ధిక్ పాండ్యా, వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, ఓపెనర్ కెఎల్ రాహుల్ కు విశ్రాంతినిచ్చారు.

న్యూజిలాండ్ సూపర్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సైతం తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ లకు దూరమయ్యారు.

భారతజట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, సహాయక బృందం సైతం బ్రేక్ తీసుకోడంతో జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ తన సహయక బృందంతో న్యూజిలాండ్ పర్యటన బాధ్యతలు నిర్వర్తించనున్నారు..

నేటినుంచి టీ-20 సిరీస్

తీన్మార్ టీ-20 సిరీస్ లోని తొలిసమరం వెలింగ్టన్ లోని రీజినల్ స్టేడియం వేదికగా శుక్రవారం ప్రారంభమవుతుంది.

నవంబర్ 20 న బే ఓవల్ వేదికగా రెండో టీ-20, నవంబర్ 22న నేపియర్ మెక్లీన్ పార్క్ వేదికగా మూడో టీ-20 మ్యాచ్ లు జరుగుతాయి.

25 నుంచి తీన్మార్ వన్డే సిరీస్...

టీ-20 సిరీస్ ముగిసిన రెండురోజుల విరామం లోనే మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ కు అక్లాండ్ వేదికగా తెరలేవనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారతజట్టు తన తొలివన్డే మ్యాచ్ ను అక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికగా ఆడనుంది.

27న హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదిక రెండో వన్డే, 30న క్ర్రైస్ట్ చర్చి హాగ్లే ఓవల్ గ్రౌండ్స్ వేదికగా మూడో వన్డే నిర్వహిస్తారు.

అందరికళ్లూ సూర్యకుమార్ పైనే...

టీ-20 ప్రపంచకప్ లో తన 360 డిగ్రీల బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించిన సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ కే ప్రధాన ఆకర్షణ కానున్నాడు. ఓపెనర్ గా శుభమన్ గిల్ భారత తరపున టీ-20ల్లో ఈరోజు అరంగేట్రం చేయనున్నాడు.

మెరుపు ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మాలిక్ జులై తరువాత తన తొలి అంతర్జాతీయమ్యాచ్ కు సిద్ధమయ్యాడు.

హార్థిక్ పాండ్యా నాయకత్వంలోని భారతజట్టు సభ్యుల్లో రిషభ్ పంత్, శుభ్ మన్ గిల్, ఇశాంత్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

ఆతిథ్య కివీజట్టుకు కేన్ విలియమ్స్ సన్ నాయకత్వం వహిస్తున్నాడు.

First Published:  18 Nov 2022 8:50 AM IST
Next Story