Telugu Global
Sports

చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్..విరాట్ కు ఏమయ్యింది?

బంగ్లాదేశ్ తో సిరీస్ లో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ దారుణంగా విఫలం కావడం విమర్శకుల నోటికి పని చెప్పింది.

చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్..విరాట్ కు ఏమయ్యింది?
X

చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్..విరాట్ కు ఏమయ్యింది?

బంగ్లాదేశ్ తో సిరీస్ లో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కొహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లోనూ దారుణంగా విఫలం కావడం విమర్శకుల నోటికి పని చెప్పింది....

విరాట్ కొహ్లీ..సూపర్ ఫిట్ క్రికెటర్.. విరాట్ కొహ్లీ.. ప్రపంచ మేటి బ్యాటర్...విరాట్ కొహ్లీ..నమ్మదగిన మెరుపు ఫీల్డర్...ఈ కితాబులన్నీ నిన్నటి వరకూ మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్ లో కొహ్లీకి పై వర్ణనలు ఏమాత్రం వర్తించవు.

బంగ్లాదేశ్ తో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో విరాట్ బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో దారుణంగా విఫలమయ్యాడు. జట్టుకే భారంగా, ఓ అలంకరణగా మారాడు.

వన్డే క్రికెట్, టెస్టు క్రికెట్ ఫార్మాట్లలో కలసి 72 శతకాలు బాదిన మొనగాడు విరాట్. అయితే..బంగ్లా పిచ్ లపైన..బంగ్లా బౌలర్ల ముందు విరాట్ ఆటలు ఏమాత్రం సాగలేదు. పూర్తిగా తేలిపోయాడు.


బ్యాటింగ్ లో విఫలం...

బంగ్లాదేశ్ తో చోటాగ్రామ్ వేదికగా ముగిసిన తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 1 పరుగుకు అవుట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. ఇక మీర్పూర్ నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండోటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 24 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో ఒకే ఒక్క పరుగుకు అవుటయ్యాడు.

మొత్తం నాలుగు ఇన్నింగ్స్ లో కలిపి 45 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఫీల్డింగ్ లో వెలవెల....

అత్యున్నత ఫీల్డింగ్ ప్రమాణాలకు మరో పేరైన విరాట్ కొహ్లీ..బంగ్లాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఐదు కీలక క్యాచ్ లు విడిచి పెట్టాడు. క్యాచ్ లు పట్టుకోలేకపోయింది విరాట్ కొహ్లీనేనా అనుకొనేలా చేశాడు.

విరాట్ బ్యాటర్ గా మాత్రమే కాదు..ఫీల్డర్ గానూ విఫలం కావడం పట్ల విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సైతం కెప్టెన్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ ల వైఫల్యం పైన మండిపడుతున్నారు. దేశంలో ప్రతిభావంతులైన పలువురు యువక్రికెటర్లు అందుబాటులో ఉంటే..ఇంకా విరాట్ లాంటి ఆటగాళ్లకు ఎందుకు అవకాశాలు ఇవ్వాలంటూ నిలదీస్తున్నారు.

ప్రస్తుత సిరీస్ వరకూ విరాట్ కొహ్లీకి 104 టెస్టుల్లో 27 శతకాలు, 7 ద్విశతకాలతో సహా 8వేల 119 పరుగులు చేసిన అసాధారణ రికార్డు ఉంది. 265 వన్డేల్లో 44 సెంచరీలు,115 టీ-20ల్లో ఓ శతకం సాధించిన అసాధారణ రికార్డు ఉంది. ఫీల్డర్ గా మూడు ఫార్మాట్లలోనూ వందలకొద్ది క్యాచ్ లు అందుకొన్న ఘనత విరాట్ కు మాత్రమే దక్కుతుంది.

ప్రస్తుత బంగ్లాసిరీస్ మాత్రం 33 సంవత్సరాల విరాట్ కెరియర్ లో ఓ చేదుఅనుభవంగా, వైఫల్యాల సిరీస్ గా మిగిలిపోతుంది.

First Published:  25 Dec 2022 12:34 PM IST
Next Story