భారత్ భారీ స్కోర్.. విండీస్ లక్ష్యం 315
రాణించిన స్మృతి మంధాన..భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు
BY Raju Asari22 Dec 2024 6:54 PM IST
X
Raju Asari Updated On: 22 Dec 2024 6:54 PM IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో మొదటి మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91), ప్రతీకా రావల్ (40), తొలి వికెట్‌కు 110 రన్స్ జోడించారు. అనంతరం వచ్చిన హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31), దీప్తి శర్మ (14*) దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్ జైదా జేమ్స్ (5/45) ఐదు వికెట్ల ప్రదర్శన చేసింది. హీలీ మాథ్యూస్ 2, డాటిన్ ఒక వికెట్ తీశారు. భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. అంతకుముందు టీమిండియా అత్యధికంగా 325 రన్స్ చేసింది.
Next Story