Telugu Global
Sports

టెస్టు లీగ్ రెండోస్థానంలో భారత్

ఐసీసీ టెస్టు లీగ్ పాయింట్ల పట్టిక రెండోస్థానానికి భారత్ చేరుకొంది. చోటాగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్టులో 188 పరుగుల విజయం సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా తర్వాతి స్థానంలో నిలిచింది..

టెస్టు లీగ్ రెండోస్థానంలో భారత్
X

టెస్టు లీగ్ రెండోస్థానంలో భారత్

ఐసీసీ టెస్టు లీగ్ పాయింట్ల పట్టిక రెండోస్థానానికి భారత్ చేరుకొంది. చోటాగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్టులో 188 పరుగుల విజయం సాధించడం ద్వారా ఆస్ట్ర్రేలియా తర్వాతి స్థానంలో నిలిచింది...

ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లీగ్ పాయింట్ల పట్టికలో ఆస్ట్ర్రేలియా, భారత్ మొదటి రెండుస్థానాలలో నిలిచాయి. భారత్- బంగ్లా, ఆస్ట్ర్రేలియా- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్- పాక్ జట్ల సిరీస్ లు ముగియటంతో ఈ పరిస్థితి మరింత మారనుంది.

రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తో చిట్టగాంగ్ లోని చోటాగ్రామ్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో 188 పరుగుల భారీవిజయం సాధించడం ద్వారా భారతజట్టు తన స్థానాన్ని మరింత మెరుగుపరచుకొంది.

పాకిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని మొదటి రెండుటెస్టులు నెగ్గడం ద్వారా ఇంగ్లండ్ జట్టు భారత్ కు మేలు చేసింది. మరోవైపు..బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన తొలిటెస్టులో దక్షిణాఫ్రికా ఘోరపరాజయం పొందడంతో భారత్ కు అది కలసి వచ్చింది. ఇప్పటి వరకూ లీగ్ టేబుల్ రెండోస్థానంలో ఉంటూ వచ్చిన దక్షిణాఫ్రికా నాలుగోస్థానానికి పడిపోయింది. ఇప్పటి వరకూ నాలుగో స్థానంలో ఉంటూ వచ్చిన భారత్ మాత్రం బంగ్లా పై భారీవిజయంతో రెండోస్థానానికి చేరుకోగలిగింది.

ఆస్ట్ర్ర్రేలియా విజయశాతం 76.92..

ప్రస్తుత సీజన్లో ఆస్ట్ర్రేలియా ప్రస్తుత సిరీస్ లోని బ్రిస్బేన్ టెస్టు వరకూ 13 మ్యాచ్ లు ఆడి 9 విజయాలతో 76.92 విజయశాతం నమోదు చేసింది. అత్యధిక పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది.

మరోవైపు...గత టోర్నీ రన్నరప్ భారత్ 55.77 విజయశాతంతో లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచింది.

ఆస్ట్ర్రేలియా చేతిలో తొలిటెస్టులో 6 వికెట్ల ఓటమి పొందటం ద్వారా దక్షిణాఫ్రికా విజయశాతం 54.55కు పడిపోడంతో..పాయింట్ల పట్టిక రెండోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారిపోయింది.

భారతజట్టు బంగ్లాపై నెగ్గడంతో శ్రీలంక సైతం మరో స్థానం దిగువకు పడిపోయింది. శ్రీలంక విజయశాతం 53.33గా ఉంది.

5వ స్థానంలో ఇంగ్లండ్...

పాకిస్థాన్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ దిశగా సాగిపోతున్న ఇంగ్లండ్ 5 వ స్థానంలో నిలిచింది. రావల్పిండి, ముల్తాన్ వేదికలుగా జరిగిన మొదటి రెండుటెస్టుల్లో ఘోరపరరాజయాలు చవిచూసిన పాక్ జట్టు 42.22 విజయశాతంతో 6వ ర్యాంక్ కు దిగజారిపోయింది. పాక్ పై మొదటి రెండు టెస్టుల్లో నెగ్గినా ఇంగ్లండ్ మాత్రం 44.44 విజయశాతంతోనే ఉంది.

ఆఖరి మూడుస్థానాలలో కివీస్, విండీస్..

ఐసీసీ ప్రారంభ టెస్టు లీగ్ విజేత, టేబుల్ టాపర్ న్యూజిలాండ్ మాత్రం..ప్రస్తుత లీగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. 25.93 శాతం విజయాలతో 8వ స్థానంలో నిలిచింది.

వెస్టిండీస్ జట్టు 40.91 విజయశాతంతో 7వ స్థానంలో కొనసాగుతుంటే..బంగ్లాదేశ్ 12.12 విజయాలశాతంతో లీగ్ టేబుల్ అట్టడుగున నిలిచింది.

భారతజట్టు ప్రస్తుత సీజన్ టెస్టు లీగ్ ఫైనల్స్ చేరాలంటే...బంగ్లాతో జరిగే ప్రస్తుత సిరీస్ లోని ఆఖరి టెస్టులో నెగ్గడంతో పాటు...ఆస్ట్ర్రేలియాతో జరిగే స్వదేశీ టెస్టు సిరీస్ లో ఒక్క ఓటమికి మాత్రమే పరిమితం కావాలి. అప్పుడే లీగ్ టేబుల్ మొదటి రెండుస్థానాలలో నిలువగలుగుతుంది.

First Published:  20 Dec 2022 10:35 AM IST
Next Story