Telugu Global
Sports

150 పరుగులకే బంగ్లాను చుట్టేసిన భారత్!

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగుల భారీస్కోరు సాధించిన భారత్..మూడోరోజుఆట లంచ్ విరామానికే ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూల్చింది.

150 పరుగులకే బంగ్లాను చుట్టేసిన భారత్!
X

150 పరుగులకే బంగ్లాను చుట్టేసిన భారత్!

బంగ్లాదేశ్ తో తొలిటెస్టు మూడోరోజు ఆటలోనే భారత్ భారీవిజయానికి మార్గం సుగమం చేసుకొంది. తొలి ఇన్నింగ్స్ లో 254 పరుగుల భారీఆధిక్యత సంపాదించింది.

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగుల భారీస్కోరు సాధించిన భారత్..మూడోరోజుఆట లంచ్ విరామానికే ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూల్చింది.

రెండోరోజుఆట ముగిసే సమయానికి చేసిన స్కోరుతో మూడోరోజుఆట కొనసాగించిన బంగ్లాజట్టు ఓవర్ నైట్ స్కోరుకు మరో 17 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యింది.

కుల్దీప్ యాదవ్ స్పిన్ మ్యాజిక్...

భారతజట్టు తరపున 22 మాసాల సుదీర్ఘివిరామం తర్వాత తన తొలిటెస్టుమ్యాచ్ ఆడుతున్న లెఫ్టామ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి స్పిన్ మ్యాజిక్ తో ప్రత్యర్థిజట్టును కకావికలు చేశాడు. తన వైవిద్యభరితమైన బౌలింగ్ తో బంగ్లా టాప్, మిడిలార్డర్ ను ఓ ఆటాడు కొన్నాడు. కేవలం 16 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

బంగ్లా సీనియర్ బ్యాటర్లు షకీబుల్ హసన్, ముష్ ఫికుర్ రహీం, నూరుల్ హసన్, తైజుల్ ఇస్లాం, ఇబాదత్ హుస్సేన్ లను పడగొట్టడంలో కుల్దీప్ ప్రధానపాత్ర వహించాడు.

టెస్టు క్రికెట్ ఓ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం కుల్దీప్ కు ఇది మూడోసారి.

బంగ్లా ఆటగాళ్లలో ఐదుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగా...ముష్ పికుర్ రహీం 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, ఉమేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టారు.

భారత్ కు భారీ ఆధిక్యత..

బంగ్లాను తొలిఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆలౌట్ చేయడంతో భారత్ కు 254 పరుగుల భారీఆధిక్యత దక్కింది. రెండోఇన్నింగ్స్ లో భారత్ మరో 200 కు పైగా పరుగులు సాధించి 450 పరుగుల లక్ష్యంతో డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

మ్యాచ్ కు వేదికగా ఉన్న చోటాగ్రామ్ స్టేడియం పిచ్ స్పిన్ బౌలింగ్ కు అనువుగా ఉండడంతో ఆఖరి రెండురోజుల ఆటలో బ్యాటింగ్ ఏమాత్రం తేలికకాదు. భారత్ స్పిన్ బౌలర్ల త్రయం కుల్దీప్, అక్షర్, అశ్విన్ చెలరేగితో..బంగ్లాపై భారత్ భారీవిజయం సాధించడం ఏమంత కష్టంకాబోదు.

First Published:  16 Dec 2022 6:03 AM GMT
Next Story