Telugu Global
Sports

టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 82/4

కెప్టెన్‌ రోహిత్‌ చేరిక జట్టును మరింత బలోపేతం చేసింది.

టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 82/4
X

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్‌లో టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 82/4 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (1 నాటౌట్‌), కీపర్‌ రిషభ్‌పంత్‌ (4 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. యశస్వి 0, కేఎల్‌ రాహుల్‌ 37, కోహ్లీ 7, శుభ్‌మన్‌ గిల్‌ 31 రన్స్‌ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు, బోలాండ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లు

ఫస్ట్‌ బాల్‌కే టీమిండియాకు షాక్‌ తగిలింది. గత మ్యాచ్‌లో సెంచరీ సాధించిన యవస్వి జైస్వాల్‌ (0) గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. బాల్‌ స్లోగా వస్తున్నదంటూ మిచెల్‌ స్టార్క్‌ను యశస్వి ఆట పట్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని బౌలింగ్‌లోనే మొదటి బాల్‌కే ఎల్బీగా వెనుదిరిగాడు. మరోవైపు కేఎల్ రాహుల్‌ (37), శుభ్‌మన్‌ గిల్‌ (31) క్రీజ్‌లో పాతుకుపోయి రెండో వికెట్కు 69 రన్స్‌ జోడించారు. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. వీరిద్దరూ దూకుడుగా మొదలుపెట్టడంతో రన్స్‌ ఈజీగానే వచ్చాయి. మిచెల్‌ స్టార్క్‌ మరోసారి బౌలింగ్‌ స్పెల్‌కు వచ్చి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. మొదట కేఎల్ను ఔట్‌ చసిన స్టార్క్‌ తన తర్వాత ఓవర్‌లోనే విరాట్‌ (7) బుట్టలో వేశాడు. వీరిద్దరూ బయటకు వెళ్తున్న బాల్స్‌ను వెంటాడి మరి స్లిప్‌లో క్యాచ్‌లు ఇవ్వడం గమనార్హం. వచ్చినప్పటి నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడిన గిల్‌ కూడా బోలాండ్‌ వేసిన బాల్‌కు ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో నాలుగు ఓవర్ల వ్యవధిలో మూడు వికెట్లను టీమిండియా కోల్పోయింది.

అంతకుముందు టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్‌ ఐదు టెస్ట్‌ సిరీస్‌లో ఇప్పటికే మొదటి టెస్టులో గెలిచి 1-0 లీడింగ్‌లో ఉన్నది. కెప్టెన్‌ రోహిత్‌ చేరిక జట్టును మరింత బలోపేతం చేసింది. అదే సమయంలో ఆడిలైడ్‌ గత పర్యటన అనుభవం హెచ్చరికలు పంపుతున్నది. ఈ నేపథ్యంలో గులాబీ బంతి పోరుకు సిద్ధమైంది. తొలిటెస్టులో దెబ్బతిన్నప్పటికీ డే/నైట్‌ టెస్టు మంచి రికార్డున్న కంగారు సమరం భారత్‌కు పెద్ద పరీక్షే. రోహిత్‌ మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు చేయడం గమనార్హం.

First Published:  6 Dec 2024 12:22 PM IST
Next Story