మిడిల్ ఓవర్లలో బాగా బ్యాటింగ్ చేస్తేనే విజయావకాశాలు
ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరికొన్ని కొన్ని గంటల్లో మొదలు

ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసల్ మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరికొన్ని కొన్ని గంటల్లో మొదలుకానున్నది. 2017 ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని పాక్ పట్టుదలతో ఉన్నది. భారత స్టార్‌బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరికంటే రెండు, మూడు గంటల ముందే ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడానికి వచ్చి స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా సెట్స్‌లో చెమటోడ్చారు. కానీ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. పంత్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, అందుకే ప్రాక్టీస్‌కు రాలేదని మ్యాచ్ ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు.
దుబాయ్‌లో టాస్ కీలక పాత్ర పోషించదు. ఎందుకంటే ఇక్కడ మంచు ప్రభావం లేదు. దీంతో ఛేజింగ్ కష్టమవుతున్నది. భారత్-పాకిస్థాన్ క్రికెట్‌కు సుదీర్ఘ చరిత్ర ఉన్నది. ఇరుజట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన మ్యాచ్. కానీ ఫైనల్ మ్యాచ్ ఇంకా కీలకమైనది. మంచులేకుండా ఫ్లడ్‌లైట్ల కింద బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. స్ట్రైక్ రొటేట్ చేయడమూ అంత ఈజీ కాదు. మిడిల్ ఓవర్లలో ఎవరు బాగా రాణిస్తే వారికే విజయవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కచ్చితంగా మేము దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. కానీ పిచ్ ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ పిచ్‌పై మేం 300 లేదా 280 రన్స్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను. పిచ్ సహకరిస్తే 350-360 రన్స్ చేస్తామని గిల్ వివరించాడు.