Telugu Global
Sports

ఫస్ట్‌ సెషన్‌ లో బంగ్లాను ఆలౌట్‌ చేస్తే ఫలితం గ్యారంటీ

ముగిసిన నాలుగో రోజు ఆట.. రెండు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌

ఫస్ట్‌ సెషన్‌ లో బంగ్లాను ఆలౌట్‌ చేస్తే ఫలితం గ్యారంటీ
X

బంగ్లాదేశ్‌ తో కాన్పూర్‌ లో జరుగుతోన్న రెండో టెస్ట్‌ లో టీమిండియా విజయం సాధించాలన్నా, ఈ మ్యాచ్‌ లో ఫలితం తేలాలన్న ఐదో రోజు (మంగళవారం) ఫస్ట్‌ సెషన్‌ అత్యంత కీలకం కాబోతుంది. ఈ టెస్ట్‌ లో నాలుగు రోజు మాత్రమే పూర్తి స్థాయి ఆట సాగింది. నాలుగో రోజు ఆటలో బంగ్లాదేశ్‌ పై భారత్‌ పైచేయి సాధించింది. సోమవారం ఉదయం ఓవర్‌ నైట్‌ స్కోర్‌ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులతో నాలుగో రోజు (సోమవారం) బ్యాటింగ్‌ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ జట్టు మరో 139 పరుగులకే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్‌ మన్‌ మొమినుల్‌ హక్‌ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ భూమ్రా 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్‌, అశ్విన్‌, ఆకాశ్‌ దీప్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. జడేజాకు ఒక వికెట్‌ దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌ ను భారత్‌ దాటిగా ఆరంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, యశస్వీ జైస్వాల్‌ వీరవిహారంతో మూడు ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. 11 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ తో 23 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ హసన్‌ మిరాజ్‌ బౌలింగ్‌ లో మెహదీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 51 బంతుల్లో 72 రన్స్‌ చేసిన జైస్వాల్‌ ను హసన్‌ మహ్మద్‌ బౌల్డ్‌ చేశాడు. శుభ్‌ మన్‌ గిల్‌ 39. విరాట్‌ కోహ్లీ 47, కేఎల్‌ రాహుల్‌ 68, రిషబ్‌ పంత్‌ తొమ్మిది, రవీంద్ర జడేజా 8, ఆకాశ్‌ దీప్‌ 12 పరుగులు పరుగులు చేసి ఔటయ్యారు. ఆకాశ్‌ దీప్‌ వికెట్‌ కోల్పోయిన తర్వాత 34.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్‌ మిరాజ్‌, షకీబ్‌ అల్‌ హసన్‌ నాలుగేసి వికెట్లు సాధించారు. హసన్‌ మహ్మద్‌ కు ఒక వికెట్‌ దక్కింది. మొత్తంగా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో టీమిండియా 52 పరుగుల ఆదిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ లో బంగ్లాదేశ్‌ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. జకీర్‌ హసన్‌ 10, హసన్‌ మహ్మద్‌ ఐదు పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కు దక్కాయి. సద్మన్‌ ఇస్లాం ఏడు పరుగులతో, మొమినుల్‌ హక్‌ పరుగులేమి చేయకుండా క్రీజ్‌ లో ఉన్నారు. మంగళవారం వాతావరణం సహకరించి, ఫస్ట్‌ సెషన్‌ లో భారత జట్టు బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌ మన్‌ ను ఆలౌట్‌ చేస్తే ఈ టెస్ట్‌ మ్యాచ్‌ టీమిండియా హస్తగతం అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఫస్ట్‌ సెషన్‌ లో బంగ్లాను ఆలౌట్‌ చేయలేకపోతే మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశం ఉంది.

First Published:  30 Sept 2024 5:53 PM IST
Next Story