Telugu Global
Sports

జూనియర్ ప్రపంచకప్ సూపర్ -6 రౌండ్లో భారత్!

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ దూకుడు కొనసాగుతోంది. గ్రూప్ లీగ్ లో ఆల్ విన్ రికార్డు సాధించడం ద్వారా సూపర్-6 రౌండ్లో అడుగుపెట్టింది.

జూనియర్ ప్రపంచకప్ సూపర్ -6 రౌండ్లో భారత్!
X

ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో హాట్ ఫేవరెట్ భారత్ దూకుడు కొనసాగుతోంది. గ్రూప్ లీగ్ లో ఆల్ విన్ రికార్డు సాధించడం ద్వారా సూపర్-6 రౌండ్లో అడుగుపెట్టింది.

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న 2024- ఐసీసీ (అండర్ -19) ప్రపంచకప్ టోర్నీ లీగ్ దశలో భారత్ హ్యాట్రిక్ విజయాలతో సూపర్ -6 రౌండ్ బెర్త్ ఖాయం చేసుకొంది.

బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాజట్లతో కూడిన గ్రూప్-ఏ లీగ్ లో మూడుకు మూడు విజయాలు సాధించడం ద్వారా 6 పాయింట్లతో టాపర్ గా నిలిచింది.

అమెరికాపై 201 పరుగుల విజయం..

బ్లూమ్ ఫాంటెయిన్ గ్రౌండ్స్ లో అమెరికా ప్రత్యర్థిగా జరిగిన గ్రూప్ ఆఖరి లీగ్ పోరులో భారత్ 201 పరుగుల భారీవిజయం సాధించింది. 50 ఓవర్ల ఈ పోరులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 326 పరుగుల భారీస్కోరు నమోదు చేసింది. సమాధానంగా 327 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన అమెరికా 8 వికెట్లకు 125పరుగులు మాత్రమే చేయగలిగింది.

గ్రూప్- బీ లీగ్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, గ్రూప్- సి లో నమీబియా, ఆస్ట్ర్రేలియా, జింబాబ్వే, శ్రీలంక, గ్రూప్ - డీ లీగ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్, అప్ఘనిస్థాన్, నేపాల్ పోటీ పడుతున్నాయి.

మొత్తం నాలుగు గ్రూపుల నుంచి కేవలం ఆరుజట్లకు మాత్రమే సూపర్ - 6 రౌండ్లో తలపడే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ తో భారత్ తొలిపోరు....

సూపర్ - 6 రౌండ్ ప్రారంభమ్యాచ్ లో న్యూజిలాండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. 1988 నుంచి 2022 వరకూ జరిగిన మొత్తం 15 అండర్ -19 ప్రపంచకప్ టోర్నీలలో భారత్ అత్యధికంగా ఐదు సార్లు విజేతగా నిలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. మహ్మద్ కైఫ్, విరాట్ కొహ్లీ, పృథ్వీ షా, ఉన్ముక్త్ చంద్, యాశ్ దుల్ ల నాయకత్వంలో భారత్ ఇప్పటి వరకూ ప్రపంచ టైటిల్స్ సాధించగలిగింది.

ప్రస్తుత ప్రపంచకప్ లో పాల్గొంటున్న భారత్ కు చీఫ్ కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్, కెప్టెన్ గా ఉదయ్ సహ్రాన్ వ్యవహరిస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ గా తెలుగు కుర్రాడు అరవిల్లి అవినాశ్ కీలక ఆటగాడిగా ఉన్నాడు.

సూపర్ - 6 దశలో ఆస్ట్ర్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల నుంచి భారత్ కు గట్టిపోటీ ఎదురుకానుంది.

First Published:  29 Jan 2024 8:45 AM
Next Story