Telugu Global
Sports

ఒళ్ళు వంచితేనే ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్- రోహిత్ శర్మ!

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టులీగ్ టైటిల్ సమరంలో నెగ్గాలంటే ఒళ్ళువంచక తప్పదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ఒళ్ళు వంచితేనే ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్- రోహిత్ శర్మ!
X

ఒళ్ళు వంచితేనే ఐసీసీ టెస్టు లీగ్ టైటిల్- రోహిత్ శర్మ!

ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగే టెస్టులీగ్ టైటిల్ సమరంలో నెగ్గాలంటే ఒళ్ళువంచక తప్పదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో తొలి ప్రపంచ టైటిల్ కోసం టాప్ ర్యాంకర్ భారత్ తహతహలాడుతోంది. ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి ఐదురోజులపాటు జరుగనున్న

2023 టెస్టు లీగ్ టైటిల్ సమరంలో ఆస్ట్ర్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది.

గంటగంటకూ మారే ఇంగ్లీష్ వాతావరణం...

ఇంగ్లండ్ వేదికగా జరిగే టెస్టుమ్యాచ్ ల్లో బ్యాటర్లకు గ్యారెంటీ ఉండదని, అక్కడి వాతావరణం నిలకడగా ఉండదని, గంటగంటకూ మారిపోతూ ఉంటుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

ఓవల్ వేదికగా జరిగే టెస్టులో తాము పైచేయి సాధించాలంటే, విజేతగా నిలవాలంటే జట్టులోని ప్రతి ఒక్క బ్యాటర్ వళ్ళు ఒంచితీరక తప్పదని అన్నాడు. సాధారణంగా ఐదురోజులపాటు జరిగే సాంప్రదాయ టెస్టుమ్యాచ్ ల్లో రోజులో మూడు సెషన్లలోనూ ఆధిపత్యం మారిపోతూ ఉంటుందని..అదే ఇంగ్లండ్ వాతావరణంలో జరిగే టెస్టుల్లో మాత్రం..గంటగంటకూ ఆధిక్యం చేతులు మారుతూ ఉంటుందని రోహిత్ శర్మ గుర్తు చేశాడు.

ఏకాగ్రత, దీక్ష తోనే సఫలం....

ఇంగ్లండ్ లో ఓ గంట ఎండకాస్తే..ఆ వెంటనే మబ్బులు పట్టి ఆకాశం మేఘావృతమైపోతూ ఉంటుందని, బ్యాటర్లు నిలకడగా ఆడటానికి తగిన పరిస్థితులు ఉండవని, మారే పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ తీరును మార్చుకోక తప్పదని తెలిపాడు.

గంటలతరబడి వికెట్ నే అంటుకుపోయి..ఎనలేని ఏకాగ్రతతో ఆడితేనే పరుగులు వస్తాయని రోహిత్ చెప్పాడు. విదేశీగడ్డపై రోహిత్ సాధించిన ఏకైక టెస్టు శతకం ఓవల్ మైదానంలో సాధించినదే కావడం విశేషం. పైగా ఐసీసీ టెస్టు లీగ్ టోర్నీలలో 50కి పైగా సగటుతో రోహిత్ అత్యంత నిలకడగా రాణిస్తు్న్న ఓపెనర్ గా గుర్తింపు పొందాడు.

ఇంగ్లీష్ వాతావరణంలో బ్యాటింగ్ చేయటం, భారీగా స్కోర్లు సాధించడం అంత తేలికకాదని, బ్యాటర్ల సత్తాకు అసలుసిసలు పరీక్ష అక్కడేనని అన్నాడు.

బౌలర్లను గంటల తరబడి ఎదుర్కొనగల సత్తా ఉన్న బ్యాటర్లు మాత్రమే పరుగులు సాధించగలరని, తమ టాపార్డర్ బ్యాటర్లంతా దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని సూచించాడు.

2021 సీజన్ టూర్ లో భాగంగా ఇంగ్లండ్ గడ్డపై ఆడిన నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.

తన అనుభవాలను మరోసారి గుర్తు చేసుకొన్నాడు. ఓవల్ లో తాను రెండేళ్ల క్రితం టెస్టుమ్యాచ్ ఆడి సెంచరీ సాధించిన సమయంలో ..వాతావరణం గంటగంటకూ మారిపోతూ వచ్చిందని, పరిస్థితులకు అనుగుణంగా తన బ్యాటింగ్ శైలిని సర్దుబాటు చేసుకొని పరుగులు చేయగలిగానని చెప్పాడు.

ఇంగ్లీష్ పిచ్ ల పైన బ్యాటర్లకు ఏ క్షణంలోనైనా అవుటయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని, ఎవరికి వారు తమ మనసు చెప్పిన విధంగా ఆడటం మంచిదని, బలాబలాలను బేరీజు వేసుకొని బ్యాటింగ్ కొనసాగించడం మేలని చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్ గడ్డపై విజయవంతమైన బ్యాటర్లుగా నిలిచిన దిగ్గజాల అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలని, అయితే..వారిని అనురించడం మాత్రం తగదని రోహిత్ చెప్పాడు.

ఫార్మాట్ ను బట్టి బ్యాటింగ్...

ఫార్మాట్ ను బట్టి బ్యాటింగ్ శైలిని మార్చుకోడం తమకు గత దశాబ్దకాలంగా అలవాటయ్యిందని, ఐపీఎల్ తర్వాత సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు అలవాటు పడటం ఏమంత కష్టంకాబోదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

తన కెరియర్ లో ఓ టీ-20 ప్రపంచకప్, ఓ చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించినా...సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రపంచ టైటిల్ సాధించడాన్ని మించిన ఘనత మరొకటి లేదని, అదే అంతిమమని రోహిత్ స్పష్టం చేశాడు.

గత నాలుగేళ్లుగా భారతజట్టు టెస్టు క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తూ వస్తోందని, వరుసగా రెండుసార్లు టెస్టు లీగ్ ఫైనల్స్ చేరటమే దానికి నిదర్శనమని తెలిపాడు.

First Published:  6 Jun 2023 9:32 AM IST
Next Story