విరాట్ కోహ్లీ సిక్స్.. వందేళ్లలో బెస్ట్ షాట్ అన్న ఐసీసీ
దాయాది పాకిస్థాన్ మీద కోహ్లీ బాదిన ఓ సిక్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ శతాబ్దపు బెస్ట్ షాట్ అని ఐసీసీ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆ షాట్ వైరలవుతోంది.
విరాట్ కోహ్లీ.. రికార్డుల రారాజు.. చేజింగ్‌లో అయితే నిజంగా కింగే.. అలా ఓ చేజింగ్‌లో దాయాది పాకిస్థాన్ మీద కోహ్లీ బాదిన ఓ సిక్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ శతాబ్దపు బెస్ట్ షాట్ అని ఐసీసీ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆ షాట్ వైరలవుతోంది.
2022 టీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లో షాట్
2022 టీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత జట్టు160 పరుగుల లక్ష్య చేధనలో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరి 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. భారత్ ఓడిపోతుందని అందరూ ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి 19వ ఓవర్ చివరి రెండు బంతులను సిక్సులు బాదేశాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేస్తున్నది పేసర్ హారిస్ రవూఫ్. ఆ ఓవర్‌లో 5వ బాల్‌ను బాడీని బ్యాలన్స్ చేస్తూ లాంగాన్ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్స్‌కు క్రికెట్ ప్రపంచం ఉర్రూతలూగింది. టోర్నీ మొత్తానికి హైలెట్ అయిన ఆ షాట్‌ను ఐసీసీ "షాట్ ఆఫ్ ది సెంచరీ" గా ప్రకటించింది.
సచిన్ అప్పర్ కట్ సిక్స్ కూడా
2003 ప్రపంచకప్‌లో ఇదే పాకిస్థాన్ మీద టార్గెట్ చేజ్ చేస్తూ సచిన్ టెండూల్కర్ షాట్ కూడా ఇప్పటికీ ప్రపంచ క్రికెట్ బెస్ట్ షాట్లలో ఒకటిగా చెప్పుకొంటారు. 150 కిలోమీటర్ల వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్ మన్లను వణికించే షోయబ్ అక్తర్ బౌలింగ్ చేస్తున్నాడు. వాయువేగంతో వచ్చిన ఆ బంతిన్ సచిన్ జస్ట్ అలా అప్పర్ కట్ కొట్టాడంతే. బంతి అందంగా అలా గాల్లో తేలుతూ వెళ్లి ఆప్‌సైడ్ పాయింట్‌లో బౌండరీ లైన్ అవతల జనాల్లో పడింది. క్రికెట్ ప్రపంచమంతా ఆ షాట్‌ను ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటుంది.