అతని అద్భుత ఆటతీరే మా ఓటమికి కారణం
రోహిత్ శర్మ ఇన్నింగ్సే మమ్మల్ని విజయానికి దూరం చేసిందని అంగీకరించిన మిచెల్ శాంట్నర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఓటమిపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. టీమిండియా గొప్పగా ఆడిందని కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆటతీరే తమ ఓటమికి కారణమని అంగీకరించాడు. ఫైనల్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలవడాన్ని చేదు ముగింపుగా అభివర్ణించాడు. 'రోహిత్ శర్మ ఇన్నింగ్సే మమ్మల్ని విజయానికి దూరం చేసింది. దుబాయ్‌లోని పరిస్థితులను ఆ జట్టు చక్కగా అర్థం చేసుకున్నది. గొప్ప క్రికెట్ ఆడింది. ఇది మాకు చేదు ముగింపులాంటిది' అని శాంట్నర్ పేర్కొన్నాడు.
ఫైనల్‌లో ఓటమిపాలైనప్పటికీ.. తమ జట్టు ప్రదర్శనపై శాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. దుబాయ్ పిచ్ పరిస్థితులపై స్పందించాడు. టీమిండియాతో ఆడటమంటే ఎప్పడూ సవాలే. సెమీఫైనల్ ఆడిన లాహోర్ కంటే దుబాయ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయితే.. దానికి సిద్ధమై మేం వచ్చాం. అని వివరించాడు. ఇక పేసర్ మ్యాట్ హెన్రీని కోల్పోవడం తమ జట్టుకు పెద్ద లోటుగా మారిందదని పేర్కొన్నాడు.