Telugu Global
Sports

ప్రపంచకప్ లో ఇక నాలుగు స్తంభాలాట!

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో సెమీఫైనల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తో మొరాకో, మాజీ చాంపియన్ అర్జెంటీనాతో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా ఫైనల్లో చోటు కోసం తలపడనున్నాయి...

ప్రపంచకప్ లో ఇక నాలుగు స్తంభాలాట!
X

ప్రపంచకప్ లో ఇక నాలుగు స్తంభాలాట!

ప్రపంచకప్ ఫుట్ బాల్ లో సెమీఫైనల్ సమరానికి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తో మొరాకో, మాజీ చాంపియన్ అర్జెంటీనాతో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా ఫైనల్లో చోటు కోసం తలపడనున్నాయి...

విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను గత కొద్దివారాలుగా ఓలలాడిస్తూ వస్తున్న ప్రపంచకప్ ఫుట్ బాల్ పోటీలు 32 దశ నుంచి ఆఖరి నాలుగుజట్ల సెమీస్ దశకు చేరుకొన్నాయి.

ఎనిమిదిజట్ల క్వార్టర్ ఫైనల్ రౌండ్ నుంచే బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, ఇంగ్లండ్ జట్లు నిష్క్ర్రమించడంతో..నాలుగుస్తంభాలాటకు డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్, రన్నరప్ క్రొయేషియా, మాజీ చాంపియన్ అర్జెంటీనా, సంచలనాల మొరాకో సై అంటే సై అంటున్నాయి.

అర్జెంటీనాకు క్రొయేషియా సవాల్..

డిసెంబర్ 14న జరిగే తొలిసెమీఫైనల్లో రెండుసార్లు విజేత, లయనల్ మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనాతో గత టోర్నీ రన్నరప్ క్రొయేషియా అమీతుమీ తేల్చుకోనుంది.

క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ ను అర్జెంటీనా కంగు తినిపిస్తే...హాట్ ఫేవరెట్ బ్రెజిల్ పై క్రొయేషియా పెనాల్టీ షూటౌట్ ద్వారా సంచలన విజయం నమోదు చేసింది.

అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ, క్రొయేషియా సారథి మెర్డిచ్ లకు ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో..తమజట్టుకు టైటిల్ అందించి మరీ రిటైర్ కావాలన్న పట్టుదలతో ఉన్నారు.

పలువులు యువఆటగాళ్లతో కూడిన క్రొయేషియా నుంచి అర్జెంటీనాకు గట్టిపోటీ ఎదురుకానుంది. మెస్సీ మ్యాజిక్ పైనే అర్జెంటీనా జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

ఫ్రాన్స్ కు మొరాకో గండం...

డిసెంబర్ 15న జరిగే రెండో సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ , ప్రస్తుత చాంపియన్ ఫ్రాన్స్ ను డార్క్ హార్స్ మొరాకో ఢీ కొనబోతోంది. క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ ను 2-1తో ఫ్రాన్స్ అధిగమిస్తే..పోర్చుగల్ ను మొరాకో ఒకే ఒక్క గోల్ తేడాతో ఇంటిదారి పట్టించింది.

లీగ్ దశ నుంచి ప్రస్తుత నాకౌట్ క్వార్టర్ ఫైనల్ వరకూ ప్రత్యర్థులకు ఒక్క గోల్ మాత్రమే ఇచ్చిన మొరాకో ఇప్పటికే పలు అరుదైన రికార్డులు నెలకొల్పింది. బెల్జియం, స్పెయిన్, పోర్చుగల్ లాంటి హేమాహేమీజట్లను మట్టికరిపించడం ద్వారా...ప్రపంచకప్ సెమీస్ చేరిన తొలి ఆఫ్రికాజట్టుగా చరిత్ర సృష్టించిన మొరాకో..ఫ్రాన్స్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.

పటిష్టమైన డిఫెన్స్ , మొండిపట్టుదలకు మరో పేరైన మొరాకోను ఓడించాలంటే ఎంబప్పే లాంటి మేటి ఆటగాడున్న ఫ్రెంచ్ జట్టు సర్వశక్తులూ కూడదీసుకొని పోరాడక తప్పదు.

First Published:  12 Dec 2022 11:03 AM IST
Next Story