Telugu Global
Sports

కొత్త సంవత్సర వేడుకల్లో ధోనీ సందడి

గోవా వేదికగా జరిగిన సంబరాల్లో తన భార్య సాక్షితో కలిసి డ్యాన్స్‌ చేసిన మిస్టర్‌ కూల్‌

కొత్త సంవత్సర వేడుకల్లో ధోనీ సందడి
X

భారత కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. గోవా వేదికగా జరిగిన సంబరాల్లో తన భార్య సాక్షితో కలిసి పాల్గొన్నాడు. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్‌ అభిమానులను ఆకట్టుకున్నది. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. పలువురు మాజీ క్రికెటర్లూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

కొత్త సంవత్సరంలో మరింత ఆనందం, విజయం, అద్భుతమైన జ్ఞాపకాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభకాంక్షలు -సురేశ్‌ రైనా

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, సంతోషంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా-గౌతమ్‌ గంభీర్‌

క్రికెట్‌ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు-బీసీసీఐ

హలో.. ఇది 2025నా?-సచిన్‌ టెండుల్కర్‌ పోస్టు

కొత్త ఉత్సాహం, సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకు సాగాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు-ఇర్ఫాన్‌ పఠాన్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజయం సాధించాలని కోరుకుంటున్నా-రవిశాస్త్రి

First Published:  1 Jan 2025 2:18 PM IST
Next Story