మాంచెస్టర్ యునైటెడ్ తో క్రిస్టియానో రొనాల్డో కటిఫ్!
ఇంగ్లండ్ లోని విఖ్యాత సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ తో పోర్చుగల్ కెప్టెన్, సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అనుబంధం ముగిసింది. పరస్పర అవగాహనతో కాంట్రాక్టు రద్దు చేసుకొంటున్నట్లు ఉభయవర్గాలు ప్రకటించాయి.
ఇంగ్లండ్ లోని విఖ్యాత సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ తో పోర్చుగల్ కెప్టెన్, సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అనుబంధం ముగిసింది. పరస్పర అవగాహనతో కాంట్రాక్టు రద్దు చేసుకొంటున్నట్లు ఉభయవర్గాలు ప్రకటించాయి...
సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో తమ అనుబంధం ముగిసినట్లు ఇంగ్లండ్ లోని విఖ్యాత సాకర్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటించింది. పరస్పర అవగాహనతో కాంట్రాక్టు రద్దు చేసుకొంటున్నట్లు తెలిపింది. తమ క్లబ్ కు అసాధారణ సేవలు అందించిన రొనాల్డోకు రానున్నకాలంలో మరింత మేలు జరగాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు..క్రిస్టియానో రొనాల్డో సైతం ఇదే తరహా ప్రకటన చేశాడు. తనకు తగిన అవకాశాలు కల్పించి..చక్కటి జ్ఞాపకాలు మిగిల్చిన యునైటెడ్ క్లబ్ కు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు.
అర్థంతరంగా...ఎందుకిలా?
మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ గా ఎన్నో గోల్స్, మరెన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రొనాల్డోను ఈ మధ్యకాలంలో మేనేజర్ గా వచ్చిన ఎరిక్ టెన్ హాగ్ పక్కన పెడుతూ రావడం, క్రమశిక్షణ చర్యలంటూ వేధించిన కారణంగానే రొనాల్డో తన కాంట్రాక్టును అర్థంతరంగా రద్దు చేసుకొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బ్రిటీష్ జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ కు ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో తన అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కాడు.
క్లబ్ యాజమాన్యం తనను నమ్మించి మోసం చేసిందని, తనకు అసలు విలువేలేకుండా పోయిందంటూ రొనాల్డో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. క్లబ్ కు కొత్తగా వచ్చిన మేనేజర్ ఎరిక్ తో తనకు అస్సలు పొసగడం లేదని, క్రమశిక్షణ అంటూ తనను ప్రధాన ఆటగాడి నుంచి సబ్ స్టిట్యూట్ ఆటగాడి స్థాయికి తీసుకువచ్చారని వాపోయాడు.
మరోవైపు..క్రిస్టియానో రొనాల్డో ప్రాక్టీసుకు దూరంగా ఉంటూ...మేనేజర్ చెప్పిన మాటను ఖాతరు చేయకుండా క్రమశిక్షణ తప్పుతున్నాడంటూ క్లబ్ వర్గాలు చెబుతున్నాయి.
ఉభయవర్గాలు విడిపోవాలని నిర్ణయించుకొన్న తర్వాతే...కాంట్రాక్టును రద్దు చేసుకొన్నామంటూ మాంచెస్టర్ యునైటెడ్ వివరణ ఇచ్చింది. రొనాల్డోతో కాంట్రాక్టు రద్దు తరువాత..క్లబ్ ను సైతం విక్రయించే ఆలోచన ఉన్నట్లు ప్రకటించింది.
ఓల్డ్ ట్రాఫోర్డ్ ప్రధానకేంద్రంగా ఉన్న మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున గతంలోనూ, ప్రస్తుతం రెండు విడతలుగా కాంట్రాక్టు కుదుర్చుకొన్న రొనాల్డో మొత్తం 346 మ్యాచ్ లు ఆడి 145 గోల్స్ సాధించాడు.
2009 సీజన్లో మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ నుంచి తొలిసారిగా వైదొలిగిన రొనాల్డో ..ప్రస్తుత 2021-22 సీజన్లో సైతం మరోసారి కాంట్రాక్టును రద్దు చేసుకొన్నాడు.
37 సంవత్సరాల రొనాల్డో తన కెరియర్ లో 9 సంవత్సరాలపాటు మాంచెస్టర్ యునైటెడ్ కు సేవలు అందించిన రొనాల్డో వచ్చే సీజన్ నుంచి ఏ క్లబ్ కు ప్రాతినిథ్యం వహిస్తాడన్నది తేలాల్సి ఉంది.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ లో పాల్గొంటున్న పోర్చుగల్ జట్టుకు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వం వహిస్తున్నాడు. తన కెరియర్ లో ఇదే ఆఖరి ప్రపంచకప్ కానుందని రొనాల్డో పరోక్షంగా ఇప్పటికే ప్రకటించాడు.