Telugu Global
Sports

ప్రపంచ టెస్ట్ లీగ్ ఫైనల్ కు కౌంట్ డౌన్!

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో చాంపియన్ ఎవరో తేల్చుకోడానికి జరిగే టైటిల్ పోరుకు ఆస్ట్ర్రేలియా, భారత జట్లు సై అంటే సై అంటున్నాయి.

Cricket News Telugu: ప్రపంచ టెస్ట్ లీగ్ ఫైనల్ కు కౌంట్ డౌన్!
X

Cricket News Telugu: ప్రపంచ టెస్ట్ లీగ్ ఫైనల్ కు కౌంట్ డౌన్!

సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో చాంపియన్ ఎవరో తేల్చుకోడానికి జరిగే టైటిల్ పోరుకు ఆస్ట్ర్రేలియా, భారత జట్లు సై అంటే సై అంటున్నాయి. టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా 15 మంది సభ్యులజట్టును ప్రకటించింది..

సాంప్రదాయటెస్టు ఫార్మాట్లో ఐసీసీ నిర్వహిస్తున్న ప్రపంచ టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. జూన్ 7 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ టైటిల్ సమరంలో టాప్ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో గత టోర్నీ రన్నరప్, రెండోర్యాంకర్ భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

2023 సీజన్ టైటిల్ కోసం టెస్టు హోదా పొందిన మొత్తం 10 దేశాల మధ్య నిర్వహించిన సిరీస్ ల పరంపర నుంచి ఆస్ట్ర్రేలియా, భారత్ అత్యధిక పాయింట్లు సాధించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సంపాదించాయి.

తటస్థ వేదికలోనే డబ్లుటీసీ ఫైనల్స్...

గత టెస్టు లీగ్ ( 2022 ) ఫైనల్లో న్యూజిలాండ్- భారతజట్టు తలపడగా..2023 సీజన్ టైటిల్ సమరంలో భారత్, ఆస్ట్ర్రేలియా పోటీపడబోతున్నాయి. ఫైనల్స్ కు సన్నాహకంగా జరిగే యాషెస్ సిరీస్ లో 17 మంది సభ్యుల ఆస్ట్ర్రేలియా పాల్గోనుంది.

రెండుమ్యాచ్ ల యాషెస్ సిరీస్ లో పాల్గొనే కంగారూ జట్టుకు ఆల్ రౌండర్ పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గాను, స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్ గాను వ్యవహరిస్తారు.

ఇంగ్లండ్ తో జరిగే యాషెస్ సిరీస్ రెండుటెస్టులను ఎడ్జ్ బాస్టన్, లార్డ్స్ వేదికలుగా నిర్వహిస్తారు.

డేవిడ్ వార్నర్ కు పిలుపు...

యాషెస్ సిరీస్ తో పాటు భారత్ తో జరిగే టెస్టు లీగ్ ఫైనల్లో పాల్గొనే ఆస్ట్ర్రేలియా జట్టులో సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు తిరిగి చోటు కల్పించారు.

2021 సీజన్ నుంచి వార్నర్ ఆడిన 32 టెస్టు ఇన్నింగ్స్ లో కేవలం ఒకే ఒక సెంచరీ సాధించాడు. 2019 యాషెస్ సిరీస్ లో సైతం వార్నర్ 9.5 సగటుతో దారుణంగా విఫలమయ్యాడు.

అయితే..వార్నర్ కు మరో అవకాశమివ్వాలని క్రికెట్ ఆస్ట్ర్రేలియా ఎంపిక సంఘం నిర్ణయించింది. వార్నర్ తో కలసి ఆస్ట్ర్రేలియా ఇన్నింగ్స్ ను ఉస్మాన్ క్వాజా ప్రారంభించే అవకాశం ఉంది.

మార్కుస్ హ్యారిస్, మాట్ రెన్ షాలకు సైతం ఓపెనర్లుగా ఆస్ట్ర్రేలియాజట్టులో చోటు కల్పించారు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ ఉన్నారు.

భారత్ తో జరిగిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో పాల్గొన్న ఆస్టన్ అగర్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, మిషెల్ స్వీప్ సన్, మాట్ కున్ మాన్ లకు టెస్ట్ లీగ్ ఫైనల్ జట్టులో చోటు దక్కలేదు.

టెస్టు లీగ్ ఫైనల్ జరిగే వేదిక, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేసినట్లు క్రికెట్ ఆస్ట్ర్రేలియా సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జి బెయిలీ వివరించారు.

మొత్తం 17 మంది యాషెస్ సిరీస్ బృందం నుంచి టెస్టులీగ్ లో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును మే 28న ప్రకటిస్తామని తెలిపారు.

జూన్ 7 నుంచి 11 వరకూ టెస్టు లీగ్ ఫైనల్స్ జరుగనుంది. గత టోర్నీ రన్నరప్ భారత్ తన తుదిజట్టును త్వరలోనే ప్రకటించనుంది. భారత ప్రధాన ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ ల్లో తలమునకలై ఉన్నారు.

ఇదీ ఆస్ట్ర్రేలియా జట్టు-

పాట్ కమిన్స్ ( కెప్టెన్ ), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కుస్ హారిస్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ క్వాజా, మార్నుస్ లబుషేన్, నేథన్ లయన్, టోడ్ మర్ఫీ, మాథ్యూ రెన్ షా, స్టీవ్ స్మిత్ ( వైస్ కెప్టెన్ ), మిషెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

First Published:  20 April 2023 6:31 PM IST
Next Story