Telugu Global
Sports

రేపటి నుంచే కామన్‌వెల్త్ గేమ్స్ 2022.. భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..

ఈసారి ఇండియా నుంచి 214 మంది అథ్లెట్లు 16 క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో 72 దేశాలకు చెందిన అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పాల్గొననున్నారు.

రేపటి నుంచే కామన్‌వెల్త్ గేమ్స్ 2022.. భారత అథ్లెట్ల షెడ్యూల్ ఇదే..
X

ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ తర్వాత ప్రతిష్టాత్మకమైన కామన్‌వెల్త్ గేమ్స్ రేపటి నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గతంలో కంటే అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో కామన్‌వెల్త్ గేమ్స్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. 2018లో గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత జట్టు 66 పతకాలు సాధించింది. ఢిల్లీలో జరిగిన గేమ్స్‌లో భారత అథ్లెట్లు 100కు పైగా పతకాలు సాధించారు. ఇక ఈసారి ఇండియా నుంచి 214 మంది అథ్లెట్లు 16 క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారు. మొత్తంగా కామన్‌వెల్త్ గేమ్స్‌లో 72 దేశాలకు చెందిన అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పాల్గొననున్నారు.

జూలై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్ ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. అయితే, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఆశలన్నీ బ్యాడ్మింటన్ క్రీడాకారులపైనే ఉన్నాయి. బాక్సింగ్‌, వెయిట్ లిఫ్టింగ్, హాకీపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ఈసారి మహిళల క్రికెట్‌ను కూడా కామన్‌వెల్త్ గేమ్స్‌లో చేర్చారు. భారత్‌కు ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

భారత ఆటగాళ్ల షెడ్యూల్..

మహిళల క్రికెట్‌

జూలై 29: భారత్‌ vs ఆస్ట్రేలియా

జూలై 31: భారత్‌ vs పాకిస్తాన్‌

ఆగస్ట్‌ 3: భారత్‌ vs బార్బడోస్‌

బాక్సింగ్‌

జూలై 30: అమిత్‌ పంగాల్‌ (మెన్స్‌ 51 కేజీ)

మహ్మద్‌ హుసాముద్దీన్‌ (మెన్స్‌ 57 కేజీ)

శివ థాపా (మెన్స్‌ 63 కేజీ)

రోహిత్‌ టోకాస్‌ (మెన్స్‌ 67 కేజీ)

సుమిత్‌ కుందు (మెన్స్‌ 75 కేజీ)

ఆశిష్‌ చౌదరి (మెన్స్‌ 80 కేజీ)

సంజీత్‌ (మెన్స్‌ 92 కేజీ)

సాగర్‌ (మెన్స్‌ 92+ కేజీ)

నీతూ (వుమెన్స్‌ 48 కేజీ)

నిఖత్‌ జరీన్‌ (వుమెన్స్‌ 50 కేజీ)

జాస్మిత్‌ (వుమెన్స్‌ 60 కేజీ)

లవ్లీనా బోర్గహైన్‌ (వుమెన్స్‌ 70 కేజీ)

పురుషుల హాకీ

జూలై 31: భారత్‌ vs ఘనా

ఆగస్ట్‌ 1: భారత్‌ vs ఇంగ్లండ్‌

ఆగస్ట్‌ 3: భారత్‌ vs కెనడా

ఆగస్ట్‌ 4: భారత్‌ vs వేల్స్‌

మహిళల హాకీ

జూలై 29: భారత్‌ vs ఘనా

జూలై 30: భారత్‌ vs వేల్స్‌

ఆగస్ట్‌ 2: భారత్‌ vs ఇంగ్లండ్‌

ఆగస్ట్‌ 3: భారత్‌ vs కెనడా

రెజ్లింగ్

ఆగస్ట్‌ 5: బజరంగ్‌ పూనియా (మెన్స్‌ 65 కేజీ)

దీపక్‌ పూనియా (మెన్స్‌ 86 కేజీ)

మోహిత్‌ గ్రెవాల్‌ (మెన్స్‌ 125 కేజీ)

అన్షు మాలిక్‌ (వుమెన్స్‌ 57 కేజీ)

సాక్షి మాలిక్‌ (వుమెన్స్‌ 62 కేజీ)

దివ్యా కాక్రన్‌ (వుమెన్స్‌ 68 కేజీ)

ఆగస్ట్‌ 6:రవికుమార్‌ దహియా (57 కేజీ)

నవీన్‌ (మెన్స్‌ 74 కేజీ)

దీపక్‌ (మెన్స్‌ 97 కేజీ)

పూజా గెహ్లోత్‌ (వుమెన్స్‌ 50 కేజీ)

వినేష్‌ పోఘాట్‌ (వుమెన్స్‌ 53 కేజీ)

పూజా సిహాగ్‌ (వుమెన్స్‌ 76 కేజీ)

జూలై 29: అశ్విని పొన్నప్ప, సుమీత్‌ రెడ్డి (బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌)

అథ్లెటిక్స్

జూలై 30: నితేందర్‌ రావత్‌ (పురుషుల మారథాన్)

ఆగస్ట్‌ 2: అవినాశ్‌ సేబుల్‌ (పురుషుల‌ 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌)

మురళీ శ్రీశంకర్‌, మహ్మద్‌ అనీస్‌ (పురుషుల లాంగ్‌ జంప్‌)

జ్యోతి (మహళల 100మీ హర్డిల్స్‌)

నవ్‌జీత్‌ కౌర్‌ (మహిళల డిస్కస్‌ త్రో)

ఆగస్ట్‌ 3: పీవీ సింధు, ఆకర్షి కశ్యప్‌ (బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌)

లక్ష్య సేన్‌, కిదాంబి శ్రీకాంత్‌ (పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌)

ఆగస్ట్‌ 4: ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌ (బ్యాడ్మింటన్‌ మహిళల డబుల్స్‌)

సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి (పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌)

ఆగస్ట్‌ 5: డీపీ మను, రోహిత్ యాదవ్‌ (పురుషుల జావెలిన్‌ త్రో)

అబ్దుల్లా అబూబాకర్‌, ప్రవీణ్‌ చిత్రవేల్‌, ఎల్దోస్‌ పాల్‌ (పురుషుల ట్రిపుల్ జంప్‌)

సందీప్‌ కుమార్‌, అమిత్‌ ఖత్రి (పురుషుల 10కిమీ రేస్‌ వాక్‌)

ఆన్సీ సోజన్‌ (మహిళల లాంగ్‌ జంప్‌)

అన్నూ రాణి, శిల్పా రాణి (మహిళల జావెలిన్‌ త్రో)

మంజు బాలా సింగ్‌, సరితా రోమిత్‌ సింగ్‌ (మహిళల హ్యామర్‌ త్రో)

ఆగస్ట్‌ 6: అమోజ్‌ జాకబ్‌, నోవా నిర్మల్‌ టామ్‌, అరోకియా రాజీవ్‌, మహ్మద్‌ అజ్మల్‌, నాగనాథన్‌ పండి, రాజేష్‌ రమేష్‌ (పురుషుల 4X400మీ రిలే)

భావన జాట్‌, ప్రియాంకా గోస్వామి (మహిళల 10కిమీ రేస్‌ వాక్‌)

హిమ దాస్‌, ద్యుతీ చంద్‌, శ్రాబనీ నందా, ఎంవీ జిల్నా, ఎన్‌ఎస్‌ సిమి (మహిళల 4X100మీ రిలే)

వెయిట్‌లిఫ్టింగ్‌

జూలై 30: మీరాబాయి చాను (వుమెన్స్‌ 55 కేజీ)

సంకేత్‌ మహదేవ్‌ (మెన్స్‌ 55 కేజీ)

రిషికాంతా సింగ్‌ (మెన్స్‌ 55 కేజీ)

జూలై31: బింద్రాయనీ దేవి (వుమెన్స్‌ 59 కేజీ)

జెరెమీ లాల్‌రినుంగా (మెన్స్‌ 67 కేజీ)

అచింతా (మెన్స్‌ 73 కేజీ)

ఆగస్ట్‌ 1: పాపీ హజారికా (వుమెన్స్‌ 64 కేజీ)

అజయ్‌ సింగ్‌ (మెన్స్‌ 81 కేజీ)

ఆగస్ట్‌ 2: ఉషా కుమార (వుమెన్స్‌ 87 కేజీ)

పూర్ణిమా పాండే (వుమెన్స్‌ 87+ కేజీ)

వికాస్‌ ఠాకూర్‌ (మెన్స్‌ 96 కేజీ)

రాగాల వెంకట్‌ రాహుల్‌ (మెన్స్‌ 96 కేజీ)

First Published:  27 July 2022 8:48 PM IST
Next Story