Telugu Global
Sports

కుప్పకూలిన టీమిండియా టాప్‌ ఆర్డర్‌

లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ స్కోర్‌ 6 వికెట్ల నష్టానికి 34 రన్స్‌

కుప్పకూలిన టీమిండియా టాప్‌ ఆర్డర్‌
X

భారత్‌ -కివీస్‌ మొదటి టెస్ట్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌ దిగిన టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (2), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన విరాట్‌ కోహ్లీ (0) పరుగులకే వెనుదిరిగారు. 12.4 ఓవర్లకు భారత్‌ 3 వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 34 రన్స్‌ మాత్రమే చేయగలిగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై కివీస్‌ బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో రన్స్‌ సంగతి అటుంచితే బాల్‌ను ఎదుర్కోవడానికే భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. నలుగురు టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు (విరాట్‌, సర్ఫరాజ్‌, కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరడం గమానార్హం. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (13), రిషభ్‌ పంత్‌ (15 నాటౌట్‌) మాత్రమే ఇప్పటి వరకు డబుల్‌ డిజిట్‌ సాధించారు. కివీస్‌ బౌలర్లలో విలియమ్‌ ఓరౌర్కీ (3-13), మ్యాట్‌ హెన్నీ (2-12), టీమ్‌ సౌథీ (1-8) భారత్‌ టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.

మారిన మ్యాచ్‌ టైమింగ్స్‌

వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్‌ వేళల్లో స్వల్ప మార్పులు చేశారు. ఫస్ట్‌ సెషన్‌: 12 గంటల వరకు, సెకండ్‌ సెషన్‌: 12.45 నుంచి 2.55 వరకు, మూడో సెషన్‌ 3.15 నుంచి 5.15 గంటల వరకు సాగనున్నది.

First Published:  17 Oct 2024 7:06 AM GMT
Next Story